Published : 13 Apr 2022 01:25 IST

Viral video: గాల్లో ఎగిరే బంగారు తాబేళ్లను ఎప్పుడైనా చుశారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రకృతిలో అద్భుతాలకు కొదవలేదు. లేత బంగారు వర్ణంలో ధగధగా మెరుస్తున్న ఈ బుల్లి తాబేళ్లను చూసిన నెటిజన్లు ఇదే అంటున్నారు. అమేజింగ్‌ ప్లానెట్ ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఓ వీడియో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈగ సైజులో అరచేతిలో కదలాడుతూ కనిసిస్తున్న ఈ కీటకాలకు రెక్కలున్నాయి. కదిపితే రివ్వున గాల్లోకి ఎగురుతున్నాయి. ఇవి మనకు సాధారణంగా కనిపించే రెక్కల పురుగుల్లాంటివేనని, బంగారు పూత పూసినట్టుగా ఉన్న వీటి రంగు మాత్రం అరుదుగా కనిపించేదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు సుమారు 10 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఈ దృశ్యాలు ఏ ప్రాంతానికి చెందినవో కచ్చితంగా పేర్కొనలేదు. దక్షిణ తూర్పు ఆసియాల్లో ఇవి ఎక్కువగా కనిసిస్తుంటాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.



Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts