Viral Video: కేర్‌టేకర్‌తో పాండాల ఆటలు.. ప్లీజ్ ఆ ఉద్యోగం ఇప్పించండి అంటున్న నెటిజన్లు!
ఇంటర్నెట్ డెస్క్: జంతువుల ఆటలు చూడముచ్చటగా ఉంటాయి. అవి సరదాగా గడుపుతుంటే వాటిని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ సంరక్షణ కేంద్రంలో కేర్‌టేకర్‌తో పాండాలు ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇప్పటికే దాన్ని 6.5మిలియన్ల మందికి పైగా వీక్షించారు. 222వేల మందికిపైగా లైక్ చేశారు.
సంరక్షణ కేంద్రంలో పనిచేస్తున్న కేర్‌టేకర్‌ను ఆ పని చేసుకోనీయకుండా ఆ పాండాలు నిత్యం అడ్డుపడ్డాయి. ఓ పాండా ఏకంగా అతడి పైకెక్కి మరీ ఆటలాడింది. సంరక్షకుడు ఎక్కడి వెళ్లినా తోడుగా గుంపుగా వెళ్లి ఆయన పనికి అడ్డుపడ్డాయి. తమ సంరక్షకుడిపై పాండాలకున్న ప్రేమను ఈ వీడియో తెలియజేస్తోంది.
ఈ క్లిప్పింగ్‌ను చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు. పాండాల ఆటలు, సంరక్షకుడితో అవి ప్రవర్తించిన తీరుకు ముగ్ధులవుతున్నారు. ఆ కేర్‌టేకర్ పని తమకు చేయాలనుందని అనేకమంది తమ కోరికను బయటపెట్టారు. ‘ఈ పనిని నేను ఫ్రీగా చేయాలనుకుంటున్నా. 365రోజులు సంతోషంగా ఉండొచ్చు’ అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ‘ఇప్పటివరకు నేను చూసి అద్భుతమైన వీడియో ఇది’ అని కొందరు కామెంట్ చేశారు.
ఇవీ చదవండి
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Mukesh Ambani: ముకేశ్ అంబానీ కుటుంబానికి బెదిరింపు కాల్స్..!
-
Crime News
Khammam: మాజీ మంత్రి తుమ్మల ప్రధాన అనుచరుడు దారుణహత్య
-
General News
Tirumala: 50మంది అనుచరులకు శ్రీవారి బ్రేక్ దర్శనం.. ఏపీ మంత్రిపై విమర్శలు
-
Movies News
Salaar: అన్న వస్తుండు.. సలార్ ఆగమనం ఎప్పుడంటే..?
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Nikhil: ‘కార్తికేయ-2’ వాయిదా వేయాలని దిల్ రాజు కోరలేదు: నిఖిల్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Crime News: న్యాయస్థానం ఆవరణలోనే భార్య గొంతుకోశాడు
- Taiwan: అగ్రరాజ్యం దూకుడు! తైవాన్‌లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం
- Liger: సూపర్‌స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ
- Flag Hoisting: కరుణానిధి చొరవతో సీఎంల జెండావందనం!