Published : 01 Sep 2022 02:52 IST

Watch: ‘తక్కువ మార్కులేస్తారా?’.. ఉపాధ్యాయుడిని చెట్టుకు కట్టి కొట్టిన విద్యార్థులు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: తక్కువ మార్కులు వచ్చాయన్న కారణంతో విద్యార్థులను దండించే ఉపాధ్యాయులను చూసే ఉంటాం. ఇక్కడ మాత్రం సీన్‌ రివర్స్! కావాలనే తమకు తక్కువ మార్కులు వేశారన్న కారణంతో ఉపాధ్యాయుడిని, క్లర్క్‌ను చెట్టుకు కట్టి కొట్టారు విద్యార్థులు. ఝార్ఖండ్‌లో ఓ రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఝార్ఖండ్‌ అకడమిక్‌ కౌన్సిల్‌ ఇటీవల తొమ్మిదో తరగతి ఫలితాలను వెలువరించింది. ఈ ఫలితాల్లో ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలోని రెసిడెన్షియల్‌ పాఠశాలకు చెందిన 32 మంది విద్యార్థుల్లో 11 మందికి DD గ్రేడ్‌ వచ్చింది. తమకు ప్రాక్టికల్‌ పరీక్షల్లో మార్కులు తక్కువ వేయడం వల్లే తాము పరీక్షలో ఫెయిల్‌ అయ్యామని వారు ఆరోపించారు. దీంతో కావాలనే తమకు తక్కువ మార్కులు వేశారని ఆరోపిస్తూ గణిత ఉపాధ్యాయుడిని, మార్కులు ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసిన క్లర్క్‌ను చెట్టుకు కట్టి కొట్టారు. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లినప్పటికీ.. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని స్కూల్‌ యాజమాన్యం ఫిర్యాదు చేసేందుకు నిరాకరించిందట. అయితే, ప్రాక్టికల్‌ మార్కులు ఫలితాల్లో నమోదుకావని ఉపాధ్యాయులు చెబుతుండడం గమనార్హం. కేవలం రూమర్ల ఆధారంగా విద్యార్థులు ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని