Viral Video:వామ్మో.. కొండ చిలువలు ఇలా కూడా చెట్టెక్కుతాయా? వైరలవుతోన్న వీడియో

అంతర్జాల సేవలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత సోషల్‌ మీడియా వినియోగం బాగా పెరిగింది. ప్రపంచంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో మనముందుండే క్షణాల్లో ప్రత్యక్షమైపోతోంది.

Published : 09 Jan 2022 23:50 IST

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాల సేవలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత సోషల్‌ మీడియా వినియోగం బాగా పెరిగింది. ప్రపంచంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో మనకు సమాచారం అందుతోంది. అయితే, మామూలుగానే పాములను చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి కొండ చిలువ లాంటి భారీ సర్పాలను దగ్గరి నుంచి చూస్తే  అంతే సంగతులు. సాధారణంగా కొండచిలువలు చిన్న జంతువులను అమాంతం మింగేస్తాయి. కొన్నిసార్లు మనుషులను మింగేసిన ఘటనలు ఉన్నాయి. అలాంటి భయంకరమైన కొండచిలువకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. 

ఓ భారీ కొండ చిలువ ఎంతో చక్కగా చెట్టు ఎక్కుతూ కనిపించింది. మాములుగా పాములు ముందుకు సాగుతూ చెట్లను ఎక్కుతాయి. అయితే ఈ భారీ కొండచిలువ మాత్రం చెట్టుకు చుట్టుకుంటూ.. మెల్లగా పైకి ఎక్కింది. ఈ వీడియో చూడటానికి భయమేసినా ఆ పాము చెట్టెక్కిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోని చూసి నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతూ షేర్ చేస్తున్నారు. అయితే ఇది పాత వీడియోనే అయినప్పటికీ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియోని ఎవరు చిత్రికరించారోగానీ ఐఎఫ్ఎస్ సుశాంత నంద ట్విట్టర్‌లో పోస్టుచేశారు. మీరు కూడా దానిపై ఓ లుక్కేయండి.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని