Published : 14 Sep 2022 13:49 IST

Viral Video: తాళి కట్టే వేళ.. పెళ్లి కూతురు పట్టలేని ఆనందంతో.. వీడియో వైరల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెళ్లి అనే మాట వినగానే.. ప్రతి ఆడపిల్లకు ఆనందంతో పాటు కొంత బెరకు, బాధ ఉండటం సహజమే. అయితే, మనసుకు నచ్చిన వాడిని మనువాడితే ఆ వధువు సంతోషానికి హద్దులుండవు. ఈ వధువుకు కూడా అలాంటి అదృష్టమే దక్కినట్లుంది. అందుకే.. తాళికట్టే వేళ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. పట్టరాని సంతోషంతో కేరింతలు కొడుతూ మూడు ముళ్లు వేయించుకొని.. వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.

తమిళ సంప్రదాయంలో జరిగిన ఓ వివాహ వేడుకలో పెళ్లికూతురు ఆనందంతో ఉప్పొంగిపోయిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. ఓ నెటిజన్‌ ఈ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ‘మీరు కూడా ఇలాగే ఉంటారా?’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటడంతో పాటు దీనికి నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ‘‘ఎన్నో ఏళ్ల నుంచి ఈ క్షణం కోసం ఎదురుచూస్తోందేమో..!’’.. ‘‘ప్రేమ పెళ్లికి ఇంట్లో ఒప్పుకుంటే ఇలాంటి ఆనందమే ఉంటుంది మరి..’’ అంటూ ఈ కొత్త జంటను అభినందిస్తున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని