Viral video: చెస్‌ ఒలింపియాడ్ ప్రత్యేకం.. ‘చదరంగం బ్రిడ్జ్‌’ చూశారా..?

తమిళనాడులోని మహాబలిపురంలో ఓ వంతెన ఇప్పుడు చూపరులను ఆకట్టుకుంటోంది. చెస్‌ బోర్డు తరహాలో నలుపు, తెలుపు గడుల సమూహారంతో ముస్తాబు చేసిన........

Published : 16 Jul 2022 23:18 IST

చెన్నై: తమిళనాడులోని మహాబలిపురంలో ఓ వంతెన చూపరులను ఆకట్టుకుంటోంది. చదరంగం (చెస్‌) బోర్డు తరహాలో నలుపు, తెలుపు గడుల సమాహారంతో ముస్తాబు చేసిన నేపియర్‌ బ్రిడ్జ్‌ విశేషంగా అలరిస్తోంది. ఈనెల 28వ తేదీ నుంచి మహాబలిపురంలో 44వ ఫిడే (FIDE) చెస్‌ ఒలింపియాడ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలోనే నేపియర్‌ వంతెనను చెస్‌ బోర్డు తరహాలో రూపొందించారు.

ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఐఏఎస్‌ అధికారి సుప్రియా సాహు ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘భారతదేశ చెస్ రాజధాని చెన్నై గ్రాండ్ చెస్ ఒలింపియాడ్ 2022కి ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఐకానిక్ నేపియర్ బ్రిడ్జ్‌ చెస్ బోర్డులా ముస్తాబైంది’ అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘యానిమేటెడ్ ప్రపంచంలో నడుస్తున్నట్లు అనిపిస్తోంది’ అంటూ ఓ నెటిజన్‌ పేర్కొన్నాడు. చెన్నై చూపించిన ఈ అభిమానానికి అభినందనలు అంటూ మరికొందరు పేర్కొంటున్నారు. అయితే ఈ తరహా ఏర్పాట్లు ప్రయాణానికి ప్రమాదకరమని, ఇవి వాహనదారులను అయోమయానికి గురిచేస్తాయని కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 






గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని