Viral Video: రోడ్డు ప్రమాదంలో వెంట్రుకవాసిలో తప్పించుకున్న మహిళ

రోడ్డు ప్రమాదం నుంచి ఓ మహిళ వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఆగిఉన్న ఆటోను ఢీకొనగా.......

Published : 04 Sep 2022 20:46 IST

ఎంతకాలం ఇలా అదృష్టం మీద ఆధారపడదాం అంటూ ప్రశ్నించిన సజ్జనార్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: రోడ్డు ప్రమాదం నుంచి ఓ మహిళ వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఆగిఉన్న ఆటోను ఢీకొనగా.. అదృష్టవశాత్తూ ఆమె ఆ ప్రమాదం నుంచి బయటడ్డారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎస్‌ అధికారి, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ట్విటర్‌లో పంచుకుంటూ లేవనెత్తిన ఓ ప్రశ్న అందరినీ ఆలోచింపజేస్తోంది.

రద్దీగా ఉన్న ఓ రోడ్డుపై ఓ ఆటో డ్రైవర్‌ తన ఆటోను ఎడమవైపున నిలిపి ఉంచగా.. అదే సమయంలో ఓ మహిళ అటువైపుగా నడుచుకుంటూ వెళుతున్నారు. అయితే అప్పుడే వేగంగా దూసుకొచ్చిన ఓ తెల్ల కారు ఆగి ఉన్న  ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అటువైపుగా వస్తున్న ఆ మహిళ ప్రమాదం బారినపడేవారే. కానీ ఆటో ఒకవైపు, కారు మరోవైపు పడిపోగా.. మధ్యలో ఉన్న ఆమె తృటిలో తప్పించుకున్నారు.

కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సజ్జనార్‌ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ఓ ప్రశ్నను లేవనెత్తారు. ‘తృటిలో తప్పించుకున్నారు, కానీ ఎంతకాలం మనం ఇలా అదృష్టం మీద ఆధారపడదాం’ అంటూ ప్రశ్నించారు. ‘రోడ్లపై బాధ్యతాయుతంగా ఉండండి’ అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. నెటిజన్లు స్పందిస్తూ రోడ్లపై బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాలను కోరుతున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని