Garba Dance: ముంబయి రద్దీ రైల్లో గార్బా నృత్యం.. ఆకట్టుకుంటోన్న వీడియో

శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. దాండియా, గార్బా లాంటి సంప్రదాయ నృత్యాలతో ప్రజలు సంబురాలు చేసుకుంటుండటంతో అంతటా కోలాహలం నెలకొంది.........

Published : 29 Sep 2022 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశమంతటా ప్రస్తుతం పండగ సీజన్‌ నడుస్తోంది. కొద్దిరోజుల క్రితమే వినాయక చవితి ముగియగా.. ప్రస్తుతం శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. దాండియా, గార్బా లాంటి సంప్రదాయ నృత్యాలతో ప్రజలు సంబురాలు చేసుకుంటుండటంతో అంతటా కోలాహలం నెలకొంది. ఇదిలా ఉంటే.. నిత్యం రద్దీగా ఉంటే ముంబయి లోకల్‌ రైల్లో ఓ మహిళల బృందం చేసిన గార్బా నృత్యం ఆకట్టుకుంటోంది. పది మంది మహిళలకు పైగా కలిసి ఆడుతుండగా.. మిగతా వారు చప్పట్లతో ప్రోత్సహిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ క్లిప్పింగ్‌ను ఇప్పటికే 185వేల మందికిపైగా వీక్షించారు.

కొద్దిరోజుల క్రితం రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో జరిగిన ఓ వేడుక సైతం విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక నాట్యమండలికి చెందిన బృందం.. స్విమింగ్ పూల్‌లో గార్బా డ్యాన్స్‌ చేసి మెప్పించింది. సంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు గార్బా నృత్యం చేశారు. మండపాలు, గార్డెన్లలో సర్వసాధారమణని.. వినూత్నంగా ఉండాలనే ఉద్దేశంతో స్విమ్మింగ్ పూల్‌లో గార్బా ఆడినట్లు నాట్యమండలి బృందం సభ్యులు తెలిపారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని