3 నిమిషాల్లోనే..

వ్యయప్రయాసలకోర్చి ప్రయాణం. జమ్మూ వరకు వెళ్లి.. అక్కడ కొండలు దాటి.. వైష్ణోదేవికి చేరుకుంటారు భక్తులు. అమ్మ దర్శనంతో యాత్ర పూర్తవ్వదు. అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలోని భైరవ్‌ఘాట్‌లో ఉన్న

Updated : 09 Dec 2022 12:44 IST

వ్యయప్రయాసలకోర్చి ప్రయాణం. జమ్మూ వరకు వెళ్లి.. అక్కడ కొండలు దాటి.. వైష్ణోదేవికి చేరుకుంటారు భక్తులు. అమ్మ దర్శనంతో యాత్ర పూర్తవ్వదు. అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలోని భైరవ్‌ఘాట్‌లో ఉన్న భైరవనాథుడిని చూసొస్తే గానీ యాత్ర ఫలితం దక్కదని ఓ నమ్మకం. వందల కిలోమీటర్లు ప్రయాణించి వైష్ణోదేవి చేరుకున్న భక్తులకు అసలు పరీక్ష అప్పుడే మొదలవుతుంది. రాళ్లు, రప్పలు, ఇంతెత్తు మెట్లతో కఠినంగా ఉండే మార్గంలో రెండు గంటలు నడిస్తే గానీ అయ్యగారి దర్శనం లభించదు. ఇప్పుడు ఏ కష్టం లేకుండానే భైరవనాథుడి దర్శనం పొందవచ్చు. వైష్ణోదేవి మందిరం నుంచి భైరవఘాట్‌ మధ్య నిర్మించిన రోప్‌వే సోమవారం ప్రారంభమైంది. రోప్‌వే కేబుల్‌ కారులో మూడున్నర కిలోమీటర్ల దూరం కేవలం మూడు నిమిషాల్లో చేరుకోవచ్చు. వంద రూపాయలు చెల్లిస్తే చాలు.. కేబుల్‌ కారులో భైరవఘాట్‌లో దిగబెడతారు. రోప్‌వే ద్వారా గంటకు సుమారు 800 మంది భక్తులు భైరవ్‌ఘాట్‌ చేరుకోవచ్చు. కేబుల్‌కారు ఏర్పాటుతో భైరవుడి దర్శనం సులభమైంది. పచ్చని కొండల మధ్య సాగే కేబుల్‌కారు విహారం యాత్రికులకు సరికొత్త ఉత్సాహాన్నిస్తోంది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని