Mumbai: ముంబయిలో.. నహీ చలేగా

కండలు ప్రదర్శించడానికో.. ఎండల్లో వేడి నుంచి ఉపశమనానికో కుర్రాళ్లు స్లీవ్‌లెస్‌ టీషర్టులు, చొక్కాలు ధరించడం మామూలే! వాళ్లు అలాగే మాల్స్‌, థియేటర్లు, బీచ్‌లు, రెస్టరెంట్లు.. ఎక్కడికంటే అక్కడికి వెళ్లిపోతుంటారు.

Published : 08 Apr 2023 03:13 IST

ట్రెండింగ్‌

కండలు ప్రదర్శించడానికో.. ఎండల్లో వేడి నుంచి ఉపశమనానికో కుర్రాళ్లు స్లీవ్‌లెస్‌ టీషర్టులు, చొక్కాలు ధరించడం మామూలే! వాళ్లు అలాగే మాల్స్‌, థియేటర్లు, బీచ్‌లు, రెస్టరెంట్లు.. ఎక్కడికంటే అక్కడికి వెళ్లిపోతుంటారు. కానీ ముంబయిలోని కొన్ని రెస్టరెంట్లకి ఇలా వెళ్తే అనుమతి ఉండదు. చేతుల్ని పూర్తిగా కప్పేసేలా వస్త్రధారణ ఉంటేనే అనుమతిస్తున్నారు. ముంబయిలోని కొన్ని వందల రెస్టరెంట్లలో ఈ డ్రెస్‌కోడ్‌ అమలవుతోంది. ఈ విషయాన్ని తమ అధికారిక వెబ్‌సైట్లలో సైతం పొందుపరుస్తున్నారు. ఎందుకిలా అని యాజమాన్యాలకు కొందరు కుర్రాళ్లు నిలదీస్తే ‘స్లీవ్‌లెస్‌ టాప్‌లు డీసెంట్‌గా ఉండవు’ అన్నది వాళ్ల సమాధానం. కానీ చిత్రంగా అమ్మాయిలకు ఈ నిబంధన వర్తించదు అంటున్నారు. ఏంటీ అన్యాయం? అని మగానుభావులు ఎంత మొత్తుకుంటున్నా..     ఆ రెస్టరెంట్లు ససేమిరా అంటున్నాయి. చొక్కాలు, ట్యాంక్‌టాప్‌లు, టీషర్టులు.. ఏవీ స్లీవ్‌లెస్‌ ఉండకూడదని ఖరాఖండీగా చెబుతున్నారు. దీనిపై కొందరు ఓ వాట్సప్‌ గ్రూప్‌గా ఏర్పడ్డారు. ఈ నిబంధన మార్చాలని అంతర్జాలంలో పోరాటం మొదలు పెట్టారు. ఇప్పటికైతే మద్దతు బాగానే కూడగట్టుకున్నారు. ఏదేమైనా.. వేసవి సెలవుల్లో ముంబయి చుట్టేసి రావాలని భావించే అబ్బాయిలూ.. ఈ నిబంధనని ఒక్కసారి గుర్తుంచుకోండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు