Heartbreak Insurance Fund: ప్రేమలో బ్రేకప్..పరిహారం రూ.25వేలు
అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడటం ఈరోజుల్లో కామన్. ఖర్మ కాలి విడిపోవడమూ ఎక్కువే!. ఇలాంటి సందర్భంలో ఇద్దరిలో ఒక్కరి గుండె అయినా పగిలిపోతుంది.
అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడటం ఈరోజుల్లో కామన్. ఖర్మ కాలి విడిపోవడమూ ఎక్కువే!. ఇలాంటి సందర్భంలో ఇద్దరిలో ఒక్కరి గుండె అయినా పగిలిపోతుంది. భగ్న ప్రేమికులై విషాద గీతాలు పాడుకుంటారు. ఈ బాధలో ఉన్నవాళ్లకు ఏదైనా పరిహారం దక్కితే కొంతలో కొంతైనా ఓదార్పుగా ఉంటుంది కదూ! ప్రతీక్ ఆర్యన్ అనే కుర్రాడు ఇలాగే ‘హార్ట్‌బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్’ కింద రూ.25వేలు అందుకున్నాడు. అదెలాగంటే.. ప్రతీక్‌కి ఒకమ్మాయితో రిలేషన్‌షిప్ మొదలైనప్పుడు ఇద్దరు కలిసి ఓ జాయింట్ ఖాతా ప్రారంభించారు. నెలనెలా తలా రూ.500 చొప్పున అందులో వేశారు. ఇద్దరిలో ఎవరైనా ప్రేమకి బ్రేకప్ చెప్తే ఆ మొత్తం రెండో వ్యక్తికి ఇచ్చేయాలనే నిబంధన పెట్టుకున్నారు. వీళ్ల ప్రేమ ఎన్నాళ్లకి బెడిసి కొట్టిందోగానీ.. ప్రతీక్ రూ.25వేలు గెల్చుకున్నాడు. ఈ ముచ్చటని సూటిగా సుత్తి లేకుండా ట్విటర్‌లో పంచుకున్నాడు. ఎంతైనా యువత అడ్డా కదా అది! అతగాడి ట్వీట్‌కి రీట్వీట్‌లు వరదలా పోటెత్తుతున్నాయి. ‘అర్రె మామా.. నువ్వు సూపర్. నేనూ నీలాగే చేస్తే నాకు రూ.లక్షలు దక్కేవి’ అని ఓ భగ్న ప్రేమికుడు బాధ పడితే.. ‘నువ్వు మన మగాళ్లలో ఆణిముత్యం.. ట్రెండ్‌సెట్టర్‌వి’ అని ఇంకో కుర్రాడు తెగ మెచ్చేసుకున్నాడు. సో.. అమ్మాయిలు, అబ్బాయిలూ పారాహుషార్.. ప్రేమలో పడగానే ఎంచక్కా హెచ్‌బీఐఎఫ్ ప్రారంభించండి. తేడా వస్తే.. ఇలాగైనా మీ గుండెలోని బాధ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అన్నట్టు.. ఇలాంటి ఈ ఆలోచన బీమా కంపెనీలకు ఎందుకు రాలేదు చెప్మా? అని ఆలోచిస్తున్నారా? వస్తే.. ఆ సంస్థలు దివాలా తీయకుండా ఉంటాయంటారా?
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
అవకాశం దొరికిన ప్రతిసారీ బ్రిజ్ భూషణ్ వేధింపులకు పాల్పడ్డాడు: దిల్లీ పోలీసులు
-
Vivek Agnihotri: నా సినిమాకు వ్యతిరేకంగా డబ్బులు పంచుతున్నారు: వివేక్ అగ్నిహోత్రి తీవ్ర ఆరోపణలు
-
Russia: పశ్చిమ దేశాలు నేరుగా రష్యాతో యుద్ధంలో ఉన్నాయి: సెర్గీ లవ్రోవ్
-
Motkupalli: జగన్.. నీ విధానాలు చూసి జనం నవ్వుకుంటున్నారు: మోత్కుపల్లి
-
Nara Lokesh: వచ్చేవారం నారా లోకేశ్ ‘యువగళం’ తిరిగి ప్రారంభం..!
-
Yanamala: ప్రభుత్వానివి చందమామ కథలు.. సీఐడీవి చిలకపలుకులు: యనమల