Mood Tracker Apps: మూడ్‌ని పట్టే యాప్‌లు
కుర్రకారు హార్ట్‌బీటు, పల్స్‌రేటు పట్టే మొబైల్ యాప్‌లు చాలానే ఉన్నాయి. అదే దారిలో సంతోషం, బాధలాంటి భావోద్వేగాల గుట్టు విప్పే అప్లికేషన్లూ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.
కుర్రకారు హార్ట్‌బీటు, పల్స్‌రేటు పట్టే మొబైల్ యాప్‌లు చాలానే ఉన్నాయి. అదే దారిలో సంతోషం, బాధలాంటి భావోద్వేగాల గుట్టు విప్పే అప్లికేషన్లూ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అందులో కొన్ని..
గెలిపించే.. సూపర్‌బెటర్
ఈ యాప్ మిమ్మల్ని మీరు ప్రభావితం చేసుకోవడానికి, మీలో ప్రేరణ కలగడానికి ఉపయోగపడుతుంది. మీలో ఉన్న శక్తిని కనిపెట్టి చెడు వ్యక్తులతో పోరాడే నేర్పుని ఇచ్చే ఆటలు దీంట్లో ఉంటాయి. మీకు స్ఫూర్తినిచ్చేలా మిమ్మల్ని మీరే కౌగిలించుకునే విధానం ఉంటుంది. మీరు చేరుకోవాల్సిన గమ్యం వైపు నడిపిస్తుంది. మీకు సహాయపడటానికి స్నేహితులూ దొరుకుతారు. కేలరీలు కరిగించే ప్రతి పనికీ పాయింట్లు ఉంటాయి. అందులో గెలిచి సంబరాలు చేసుకోవచ్చు.
లక్ష్యాలు గుర్తు చేసే.. డేలియో
ఈ యాప్ మీ లక్ష్యాలు చేరేందుకు సాయపడుతుంది. మీ మానసిక స్థితి ఎలా ఉందో ఇక్కడ పంచుకోవచ్చు. దానికి అనుగుణంగా.. బాధ, ఒత్తిడిలో ఉంటే ఆ మూడ్ మార్చే వీడియోలు సూచిస్తుందీ యాప్. వ్యక్తిగత, వృత్తిగత లక్ష్యాలు ఒకసారి సెట్ చేసుకుంటే.. వాటిని తరచూ గుర్తు చేస్తుంటుంది. దాంట్లో మన ఎదుగుదల ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు.
ఒత్తిడి మీటర్.. హ్యాపీమీటర్
ఇదొక స్మార్ట్‌వాచ్ యాప్. సెల్‌ఫోన్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. చేతికి పెట్టుకోగానే సెన్సర్ల ద్వారా మన మానసిక స్థితి, ఒత్తిడి స్థాయిలు తెరపై కనిపిస్తాయి. చేసే పని వివరాలు నమోదు చేసి టాస్క్ మేనేజర్‌గానూ వాడుకోవచ్చు. ప్రతి క్షణం మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారో గుర్తించవచ్చు. తీవ్ర ఒత్తిడి, బాధలో ఉన్నప్పుడు ఫోన్‌కి సందేశాలు వస్తుంటాయి. స్నేహితులు, బంధువులతో పంచుకొని ఆ బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు.
సంతోషం పెంచే.. హ్యాపీఫై
ఒత్తిడిని అధిగమించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. దీనికి లాగిన్ అయిన తర్వాత మన జీవితానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను అడిగి దాని ఆధారంగా మీ ఆనందాన్ని అంచనా వేస్తుంది. మన ఆలోచనా విధానాన్ని మార్చేలా యోగా, ధ్యానం లాంటి టాస్కులు ఇస్తారు. అసైన్‌మెంట్లు రాయిస్తారు. అనుబంధాలను దృఢం చేసే కొన్ని కోర్సుల వివరాలు అందుబాటులో ఉంటాయి.
భావోద్వేగాలు తెలిపే.. మూడ్ ట్రాక్ డైరీ
ఈ యాప్ మన భావోద్వేగాలను అనేకసార్లు రికార్డు చేస్తుంది. దీంట్లో చాలా ఫీచర్లు ఉన్నాయి. ఆఫ్‌లైన్‌లోనూ పని చేస్తుంది. ఇతరుల మనోభావాలను తెలుసుకునేందుకు వీలుగా, వారితో స్నేహాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఫీచర్ అందుబాటులో ఉంది. మన ఆనందాన్ని గ్రాఫ్‌ల రూపంలో అంచనా వేస్తుంది ఈ యాప్.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu : క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన
-
Nani: అప్పుడే మొదటి సారి ప్రేమలో పడ్డా.. ప్రస్తుతం తనే నా క్రష్: నాని
-
Madhapur Drugs Case: నటుడు నవదీప్‌ను ప్రశ్నిస్తున్న నార్కోటిక్స్ పోలీసులు