harley davidson x440: కుర్రాళ్లు మెచ్చేలా.. హార్లీ డేవిడ్‌సన్‌ ఎక్స్‌ 440

బండి అంటే ఇష్టం ఉన్న పోరగాళ్లంతా ఒక్కసారైనా చక్కర్లు కొట్టాలనుకునే ప్రీమియం మోటార్‌సైకిల్‌ హార్లీ డేవిడ్‌సన్‌. దేశీయ దిగ్గజం హీరో మోటోకార్ప్‌తో జట్టు కట్టాక విపణిలోకి తీసుకొస్తున్న తొలి మోడల్‌ ఎక్స్‌ 440.

Updated : 19 Feb 2024 16:32 IST

యువాహనం
ధర: రూ.2.75లక్షలు (ఎక్స్‌ షోరూం)

బండి అంటే ఇష్టం ఉన్న పోరగాళ్లంతా ఒక్కసారైనా చక్కర్లు కొట్టాలనుకునే ప్రీమియం మోటార్‌సైకిల్‌ హార్లీ డేవిడ్‌సన్‌. దేశీయ దిగ్గజం హీరో మోటోకార్ప్‌తో జట్టు కట్టాక విపణిలోకి తీసుకొస్తున్న తొలి మోడల్‌ ఎక్స్‌ 440. దాని విశేషాలు.

* హార్లీ బైక్‌లు అంటేనే అత్యంత ఖరీదైనవి. ఈ అమెరికా కంపెనీ భారతీయ దిగ్గజ వాహన సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకొని తొలిసారి ఓ మిడ్‌ రేంజ్‌లో ఈ మోడల్‌ని తీసుకొస్తోంది.

* బండి డిజైన్‌ బాగుంటే.. చూడ్డానికి ఆకట్టుకునేలా ఉంటే ‘అబ్బా భలే ఉందిరా బైక్‌’ అంటారు కుర్రాళ్లు. అందుకే డిజైన్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మస్క్యులర్‌ ఫ్యుయెల్‌ ట్యాంకు, వృత్తాకారంలోని హెడ్‌లైట్లు, టర్న్‌ ఇండికేటర్లు.. ప్రతీదీ యూత్‌ని ఆకట్టుకునేలా మలిచామంటోంది తయారీదారు.

* ఎలాంటి రోడ్లపై అయినా సాఫీగా సాగిపోవడానికి యూఎస్‌డీ ఫోర్క్స్‌, ట్విన్‌ గ్యాస్‌ ఛార్జ్‌డ్‌ షాక్‌ అబ్జార్బర్లు.. చీకట్లో వెలుగులు విరజిమ్మే ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, భద్రత కోసం డిస్క్‌ బ్రేక్‌లు, ఏబీఎస్‌.. సాంకేతిక వివరాలు చెప్పే టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌.. బ్లూటూత్‌ కనెక్టర్‌ కొన్ని చెప్పుకోదగ్గ ఫీచర్లు.

* 440సీసీ శక్తిమంతమైన ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌, 6 స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌.. వీటికి తగ్గట్టే మేటి టార్క్‌తో దూసుకెళ్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని