మీరెంత స్మార్ట్?
2020.. ఫాలో.. ఫాలో..
ఉదయం వాట్సాప్‌తో గుడ్ మార్నింగ్‌లు.. కాసేపయ్యాక ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో సెల్ఫీ.. సందర్భానికో ట్వీట్.. రిలాక్స్‌గా లేవకుండానే అలెక్సాకి ఆర్డర్లు.. ఇక తిరగడానికి ఓలా, ఉబర్.. తినడానకి స్విగ్గీ, జొమాటో.. తీరిగ్గా సినిమా చూడాలంటే నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్.. షాపింగ్‌కి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. ఇలా ఒకటా రెండా! గత పదేళ్లలో ఎన్నో వచ్చాయ్.. అవి చాలా నేర్పాయ్. రానున్న దశాబ్దంలో ఇంకా వస్తాయ్. వాటికెలా సిద్ధం అవ్వాలి? సోషల్ మీడియా చిక్కుముళ్లు దాటుకుని.. ప్రైవసీ పాఠాలు నేర్చుకుంటూ.. సోషల్ లైఫ్‌లో మరింత స్మార్ట్ అవ్వాలి? ఇంట గెలవడమే కాదు.. నెట్టింట కూడా గెలవాలి! అప్పుడే రానున్న దశాబ్దంలో ధీరులై నిలుస్తారు!
గుర్తింపుతో పాటు గురి
● గుర్తింపు ఒక్కటే కోరుకుంటూ గురితప్పొద్ధు మీ మాట.. పాట.. ఆట.. ఏదైనా ఒక్కసారి నెట్టింట్లో ప్రవేశించిందంటే అందనంత దూరం వెళ్లిపోతుంది. అప్‌లోడ్ చేసే ముందు ఆలోచించండి. లేదంటే.. మీకొచ్చే గుర్తింపు మిమ్మల్ని హీరోల్ని కాకుండా జీరోల్ని చేస్తుంది. తెలిసీ తెలియక.. తోచిందేదో పోస్ట్ చేసేద్దాం.. కామెంట్ పెట్టేద్దాం.. అనుకోవద్ధు అప్‌లోడ్ చేసేది ఏదైనా మీ కమ్యూనిటీలో ఉన్నవారితో పాటు ‘ఏఐ’ (కృత్రిమ మేధస్సు) నిరంతరం మీపై ఓ కన్నేసి ఉంచుతుంది. అప్రమత్తత అవసరం. నకిలీగా వ్యవహరించడం మాని నిజాయతీగా ముందుకెళ్లండి.
గోప్యతే ముఖ్యం...
సోషల్ మీడియా.. సెక్యూరిటీ కెమెరాలు.. ఫేషియల్ రికగ్నిషన్.. వాయిస్ అసిస్టెంట్‌లు.. ఐఓటీ.. ఇలా నిరంతరం టెక్నాలజీ యాక్సెస్‌తోనే గడిపే స్థితిలో ఉన్నాం. అంతెందుకు... ఏదైనా యాప్ ఇన్‌స్టాల్ చేయాలన్నా.. ఫోన్‌లో అన్ని అనుమతులు ఇవ్వాల్సిందే. మరి, మీ ఫోన్‌లో ఎన్ని యాప్‌లు మిమ్మల్ని గమనిస్తున్నాయో? ఎప్పుడైనా ఆలోచించారా? రానున్న రోజుల్లో నిఘా ఇంకా పెరుగుతుందేగానీ తగ్గదు. అందుకే వచ్చే దశాబ్దంలో నెటిజన్‌గా మీరు నేర్చుకోవాల్సిన ప్రథమ పాఠం ప్రైవసీని కాపాడుకోవడం..
* రిజిస్టర్ అయ్యాం కదా అని.. ప్రైవేటు లైఫ్‌ని పబ్లిక్ చేయడం మానుకుంటే మంచిది. మీరు అప్‌లోడ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారం మొత్తం ఓ కంపెనీ క్లౌడ్ స్థావరంలో రికార్డు అవుతున్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. వాటిపై ఎవరైనా సైబర్ దాడులు చేయొచ్ఛు ఇక యాప్‌ల వాడకంలోనూ నియమ నిబంధనలు అవసరం. ఫోన్‌లో మెమొరీ ఉందని.. అవసరం ఉన్నా లేకున్నా యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడం మానండి. వాడని యాప్ ఫోన్‌లో ఒక్కటున్నా ప్రైవసీ విషయంలో మీరు ఫెయిలే!
మాట కలపండి కానీ..
బోర్ కొడితే ఫ్రెండ్స్‌తో ఛాటింగ్.. వీడియో కాలింగ్... జోకులేసుకోవడం.. కలలు, కోరికల్ని పంచుకోవడం. ఎమోజీలతో ఎంటర్‌టైన్ అవ్వడం ఇప్పటి వరకూ చేశారు. ఇక మెల్లగా వాయిస్ అసిస్టెంట్‌లతో మాట కలపడం మొదలెట్టాం. ‘అలెక్సా.. అది కావాలి!’.. ‘సిరి.. ఇదెక్కడ?’ ‘ఓకే గూగుల్.. ఏంటి సంగతులు’ అంటూ అలవాటు పడుతున్నాం. ఇకపై అవే మిలీనియల్స్ రూమ్మేట్స్‌గా మారిపోవచ్ఛు ఫోన్‌లో.. కార్లో.. ఎక్కడికెళ్తే అక్కడ మీతో పాటే వస్తాయ్.. ఇష్టాలు.. అభిరుచులు తెలుసుకుని ప్రియ మిత్రుల్లా కలిసిపోతాయ్. మాట్లాడే తీరుని బట్టే మీరే మూడ్‌లో ఉన్నారో చెప్పేస్తాయ్. వింటున్నాయ్ కదాని.. అన్నీ పంచుకుంటే సమస్యే...
* పరిధి పెట్టకుంటే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఇప్పటికే పలు వాయిస్ అసిస్టెంట్‌లు గోప్యత విషయంలో విఫలమయ్యాయనే విమర్శలున్నాయి. వినియోగదారుల ప్రమేయం లేకుండా వారి సంభాషణల్ని రికార్డు చేసిన సంఘటనల్ని గుర్తుంచుకుని అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రైవసీ కంట్రోల్స్ వాడుకుని అవసరం మేరకు మ్యూట్ చేయడం మంచిది. బ్రౌజర్‌లోని హిస్టరీని డిలీట్ చేసినట్టుగానే వాయిస్ అసిస్టెంట్‌లోని కమాండ్స్‌ని ఎప్పటికప్పుడు చెరిపేస్తుండాలి. లేకుంటే.. మీరు ఫ్రెండు అనుకునే డిజిటల్ అసిస్టెంట్‌లు డిటెక్టివ్‌లా మీ వ్యక్తిగత వివరాల్ని రహస్యంగా చేరవేస్తాయి.
ఫిట్‌నెస్‌కి కొలమానం అనుకోవద్దు
ఆడినా.. పరిగెత్తినా.. వ్యాయామం చేసినా.. చేతికి ఫిట్‌నెస్ బ్యాండు ఉండాల్సిందే. ఎంత సమయం వ్యాయామం చేశాం.. ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయి.. ఇలా లెక్కలేస్తున్నాం. వీటి హవా మరింత పెరగనుంది. అన్ని టెక్నాలజీ కంపెనీలు ఇప్పుడు ఆరోగ్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో లైఫ్‌స్టైల్ గ్యాడ్జెట్‌లు మరింత ఆకట్టుకునేలా సిద్ధం అవుతున్నాయ్. స్మార్ట్‌గా ఆలోచిస్తూ ఫిట్‌గా ఉండాలనుకునే యువత వీటిపై మక్కువ చూపడం తప్పేం కాదు. కానీ, ఇవే ఫిట్‌నెస్‌కి కొలమానంగా తీసుకోవద్ధు.
* స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండులు, ఇతర హెల్త్ గ్యాడ్జెట్‌లతో సేకరించిన డేటాని పరిగణనలోకి తీసుకుని మేం ఫిట్‌గా ఉన్నాం అనుకోవడం ప్రమాదకర పరిస్థితులకు దారితీయొచ్ఛు ఆయా గ్యాడ్జెట్‌తో ఆరోగ్యంపై ప్రాథమిక అవగాహనకు మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. గూగుల్, యాపిల్ కంపెనీలు కూడా మితిమీరిన గ్యాడ్జెట్‌ల వాడకాన్ని తగ్గించుకోమనే చెబుతున్నాయ్.●
* నెట్టింట్లో చదివిన ప్రతీది నిజం కాదు.. ఈ దశాబ్దం మనకు నేర్పిన ముఖ్యమైన అంశాల్లో ఒకటి. దీన్నే ఫాలో అవ్వాలి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలు, పోస్టింగ్‌లను గుడ్డిగా నమ్మొద్ధు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం అనివార్యం.
* ఇంటర్నెట్ శాశ్వతం... అనే విషయాన్ని నిత్యం మననం చేసుకోవాలి. ఓ పదేళ్ల ముందు పోస్ట్ చేసిన అంశం.. వచ్చే దశాబ్దంలో మీకు ప్రతిబంధకంగా మారొచ్ఛు ఉదాహరణకు ఎప్పుడో మీరు ఇంటర్‌లో పోస్ట్ చేసినది మీరేదో ఉన్నత ఉద్యోగానికి వెళ్లినప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంటర్వ్యూ టేబుల్‌పై చర్చకు రావచ్ఛు అది మీపై నెగెటివ్‌గా ప్రభావితం చూపొచ్ఛు. ఆలోచించండి.
* డేటా క్లౌడ్‌లో ఉన్నా.. పాదాలెప్పుడూ భూమిపైనే ఉండాలి. ఆన్‌లైన్ షాపింగ్ చేసినా.. ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టుకున్నా.. యాప్స్ వాడినా.. ఫొటోలు దాచుకున్నా.. ఫ్రొఫెషనల్ నెట్‌వర్క్ క్రియేట్ చేసుకున్నా.. డేటా బ్యాక్‌అప్ అయినా.... మొత్తం క్లౌడ్‌లోనే భద్రం అవుతున్నాయి. వాడుతున్న సర్వీసుల్లో 90 శాతం క్లౌడ్ స్టోరేజ్ సేవల్ని అందిస్తున్నాయి. నేటి డిజిటల్ లైఫ్‌లో ఇది తప్పని సరి అయినప్పటికీ.. మన ఆలోచనలు వాస్తవ ప్రపంచానికి దగ్గరగా ఉన్నంత కాలం సురక్షితమే. నేల విడిచి క్లౌడ్‌లో సాము చేయొద్ధు హాట్ హాట్‌గా సర్వీసులు సిద్ధంగా ఉన్నాయ్ కదా అని.. వర్చువల్ వరల్డ్‌కి ఎగిరిపోదాం అనుకుంటే.. రియల్ వరల్డ్‌లో చతికిలపడతారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Amaravati: బరి తెగించిన వైకాపా శ్రేణులు.. అమరావతిలో భాజపా నేతలపై దాడి
-
India News
Modi: మోదీ ‘డిగ్రీ’ని చూపించాల్సిన అవసరం లేదు.. కేజ్రీవాల్‌కు జరిమానా
-
India News
Delhi: కొవిడ్ కేసుల పెరుగుదలపై ఆందోళన వద్దు: సీఎం కేజ్రీవాల్
-
World News
North Korea: కిమ్ రాజ్యంలో దారుణాలు.. గర్భిణులు, స్వలింగ సంపర్కులకు ఉరిశిక్షలు
-
General News
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో.. రద్దీ వేళల్లో రాయితీ రద్దు
-
Sports News
CSK: అత్యుత్తమ ఆల్‌రౌండర్.. ఈ స్టార్‌కు మరెవరూ సాటిరారు: హర్భజన్ సింగ్