ఉన్నచోటేఒళ్లు వంచుదాం

ఇప్పటికే నెల దాటిపోయింది.. కొందరు రోజుకో స్పెషల్‌ పేరుతో.. ఇంకొందరు దొరికిందల్లా తినేస్తూ టీవీ చూస్తూనో, ఓటీటీలు వీక్షిస్తూనో గడిపేస్తుంటారు. మరి, తిన్న తిండి ఊరికే ఉంటుందా? శరీర కొలతల్ని పెంచేస్తుంది. అందుకే.. రోజూ కచ్చితంగా ఎంతో కొంత సమయం వ్యాయామం చేయాల్సిందే. బయట అడుగుపెట్టే పరిస్థితి లేకపోయినా ఉన్నచోటే కొన్ని వ్యాయామాల్ని చేస్తూ ఫిట్‌నెస్‌ని కాపాడుకోవచ్ఛు దానికి తోడుగా కొన్ని ఫిట్‌నెస్‌ యాప్‌లనూ ఇన్‌స్టాల్‌ చేసుకోండి. దీంతో కసిగా, స్మార్ట్‌గా...

Published : 09 May 2020 01:03 IST

లాక్‌డౌన్‌ ఫిట్‌నెస్‌

ఇప్పటికే నెల దాటిపోయింది.. కొందరు రోజుకో స్పెషల్‌ పేరుతో.. ఇంకొందరు దొరికిందల్లా తినేస్తూ టీవీ చూస్తూనో, ఓటీటీలు వీక్షిస్తూనో గడిపేస్తుంటారు. మరి, తిన్న తిండి ఊరికే ఉంటుందా? శరీర కొలతల్ని పెంచేస్తుంది. అందుకే.. రోజూ కచ్చితంగా ఎంతో కొంత సమయం వ్యాయామం చేయాల్సిందే. బయట అడుగుపెట్టే పరిస్థితి లేకపోయినా ఉన్నచోటే కొన్ని వ్యాయామాల్ని చేస్తూ ఫిట్‌నెస్‌ని కాపాడుకోవచ్ఛు దానికి తోడుగా కొన్ని ఫిట్‌నెస్‌ యాప్‌లనూ ఇన్‌స్టాల్‌ చేసుకోండి. దీంతో కసిగా, స్మార్ట్‌గా కసరత్తులు చేస్తూ నాజూకుగా.. ఫిట్‌గా మారిపోవచ్చు.

బెంచ్‌ సాయంతో..

అసిస్టెడ్‌ పుష్‌-అప్స్‌

రోగ్యాన్ని కాపాడుకోవడానికి చిన్న చిన్న వ్యాయామ పద్ధతుల్ని ఫాలో అయ్యే కోవలో మీరుంటే వీటిని ప్రయత్నించొచ్ఛు పూర్తి స్థాయిలో పుష్‌-అప్స్‌ చేయలేనివారు బెంచ్‌, టేబుల్‌, పిట్టగోడలపై చేతుల్ని ఆనించి ఈ అసిస్టెడ్‌ పుష్‌-అప్స్‌ని చేయొచ్ఛు చిత్రంలో మాదిరిగా మీ సామర్థ్యం మేరకు వీటిని చేయండి. మొదట్లో సెట్‌కి పది చొప్పున చేయొచ్చు.

కుర్చీతో జోడీ...

అసిస్టెడ్‌ స్క్వాట్స్‌

రోజూ కుర్చీలో కూర్చుని లేస్తుంటారు. కానీ, ఎప్పుడైనా ఏ సపోర్టు తీసుకోకుండా కుర్చీలో నుంచి లేచారా? ట్రై చేయండి. వాటినే స్క్వాట్స్‌ అంటారు. ఓ కుర్చీని గోడకి ఆనించి పెట్టండి. కుర్చీ ముందు నిలబడి కాళ్లను భుజాలకు సమంగా జరపండి. చేతుల్ని ముందుకు చాపి నెమ్మదిగా కుర్చీకి పిరుదుల్ని తాకినట్టుగా ఆనించి తిరిగి నిలబడాలి. ఇలా ఓ పది సార్లు చేయాలి. తర్వాత మీ సామర్థ్యం మేరకు పెంచొచ్చు.

నిలబడి పరిగెత్తినట్టే!

 స్పాట్‌-హై నీస్‌

ప్పుడున్న స్థితిలో పార్కులోనో.. కాలేజీ క్యాంపస్‌లో పరుగులు తీసే అవకాశం లేదు. అందుకే ఉన్న చోటే కాస్త పరిగెత్తినట్టుగానే శరీరానికి చెమట పట్టించాలంటే ఈ స్పాట్‌-హై నీస్‌ చేయాల్సిందే. అనువైన చోటులో నిలబడి మోకాళ్లను వీలైనంత పైకి లేపుతూ చేతుల్ని ఆడిస్తూ పరిగెత్తినట్టుగానే చేయాలి. రెండు నిమిషాల పాటు ఇలానే పరిగెత్తి చూడండి.

బ్రిడ్జ్‌లా వంచడమే!

గ్లూట్‌ బ్రిడ్జ్‌

కచకా పుష్‌-అప్స్‌, పుల్‌-అప్స్‌ తీయడం వ్యాయామంలో ఒక విధానం అయితే.. శరీరాన్ని స్ట్రెచ్‌ చేసి కండరాల్ని బలంగా మార్చడం మరో రకం. గ్లూట్‌ బ్రిడ్జ్‌ అలాంటి వర్క్‌అవుటే. చిత్రంలో మాదిరిగా నేలపై పడుకుని చేతుల్ని నేలకు సమాంతరంగా చాచి మోకాళ్లను వంచాలి. తర్వాత నడుము భాగాన్ని నిదానంగా పైకి లేపి బ్రిడ్జ్‌ మాదిరిగా వాలుగా ఉంచాలి. మళ్లీ నెమ్మదిగా కిందికి దించాలి. ఇలా ఓ పది సార్లు చేయండి.

ఉపవాసానికి తోడుగా..

ఇంట్లోనే ఉన్నారుగా ఇన్ని రోజులూ.. ‘అమ్మా.. అది కావాలి. ఇది చేసిపెట్టు’ అంటూ సంతృప్తిగా లాగించేసి ఉంటారు. కాస్త బరువు కూడా పెరిగుంటారు. మరి, తగ్గాలంటే? శారీరక శ్రమతో పాటు అప్పుడప్పుడు ఉపవాసం ఉంటే మంచిది. అందుకే ఈ యాప్‌. Fastic Fasting App & Intermittent Fasting Tracker. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకుని మీ ఉపవాస విధానాన్ని మరింత స్మార్ట్‌గా మార్చేయొచ్ఛు మీ కోసం ‘ఫాస్టింగ్‌ ప్లాన్‌’లు సిద్ధంగా ఉన్నాయి. మీ ఆహారపు అలవాట్లు, ఫిట్‌నెస్‌ మేరకు తగిన ప్లాన్‌ ఎంపిక చేసుకుని ఉపవాసాన్ని ప్రారంభించొచ్ఛు

ఇంట్లోనే ట్రెయినర్‌

ప్పుట్లో జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేసే అవకాశాలు లేవు. మరైతే, ఎలాంటి వ్యాయామ సామగ్రి లేకుండా వర్క్‌అవుట్స్‌ చేయడం ఎలా? అనుకోవద్ధు Home Workout - No Equipment యాప్‌ని ప్రయత్నించొచ్ఛు దీంట్లో విభాగాల వారీగా పలు రకాల వర్క్‌అవుట్స్‌ని ఉన్నచోటే ఎలా సాధన చేయొచ్చో తెలుసుకోవచ్ఛు శరీరంలోని అన్ని అవయవాలకు తగిన వ్యాయామాల్ని ఎంపిక చేసుకుని ఇంట్లోనే సాధన చేయొచ్ఛు ఏ రోజు ఏయే వర్క్‌అవుట్స్‌ చేయాలనేది గుర్తుండదనుకుంటే ‘రిమైండర్‌’ పెట్టుకునే వీలుంది.

ఒకరకంగా ఎగరడమే!

జంపింగ్‌ జాక్స్‌

ఇంట్లోనో.. పెరట్లోనో వ్యాయామానికి అనువైన చోటుని ఎంచుకోండి. చేతులు పైకి చాచి చూసుకోండి. ఇంట్లో వ్యాయామం చేస్తున్నట్లయితే పైన మీ చేతులకు ఫ్యాన్‌లు, మరేవైనా ఇతర వస్తువులు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జంపింగ్‌ జాక్స్‌ చేయడానికి నిటారుగా నిల్చుని కాళ్లని ఎగురుతూ ఎడం చేస్తూ.. చేతుల్ని గాల్లో పైకి లేపాలి. తిరిగి కాళ్లకి దగ్గర చేసి చేతుల్ని కిందికి తేవాలంతే. మొదట్లో ఓ పది సెట్స్‌తో మొదలు పెట్టి తర్వాత మీ సామర్థ్యం మేరకు చేయండి.

నెల రోజుల్లో..

ఇంకా కొన్నిరోజుల పాటు లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితం అవ్వొచ్ఛు అందుకే రానున్న 30 రోజుల్లో కసితో వర్క్‌అవుట్స్‌ చేసి స్లిమ్‌ అయిపోదాం అనుకునే వారు 30 Day Fitness యాప్‌ని ప్రయత్నించొచ్ఛు యాప్‌ని ఆసరాగా చేసుకుని ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ని స్వీకరించండి. వర్క్‌అవుట్స్‌ మొదలుపెట్టండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని