ప్రొఫెషనల్‌గా.. ఫాలో అయిపోండి!!

వర్క్‌ ఫ్రం హోమ్‌కే మక్కువ చూపుతున్నాయి కంపెనీలు. దీంతో ఇంట్లో ఉండే ఆఫీసు పని చేసేందుకు అలవాటు పడ్డారు ఉద్యోగులు.. కానీ వర్క్‌ ఫ్రం హోమ్‌లోనూ కొన్ని రూల్స్‌ ఫాలో అవ్వాల్సిందే. ఒక ఉద్యోగిగా ఆఫీసు నిబంధనలకు కట్టుబడి పనిచేయాలి. ఆఫీసు పని విషయాలను గోప్యంగా ఉంచాలి. అందుకే వర్క్‌ ఫ్రం హోమ్‌లో ఈ నియమాల్ని ఫాలో అయిపోండి....

Published : 23 May 2020 00:29 IST

వర్క్‌ ఫ్రం హోమ్‌కే మక్కువ చూపుతున్నాయి కంపెనీలు. దీంతో ఇంట్లో ఉండే ఆఫీసు పని చేసేందుకు అలవాటు పడ్డారు ఉద్యోగులు.. కానీ వర్క్‌ ఫ్రం హోమ్‌లోనూ కొన్ని రూల్స్‌ ఫాలో అవ్వాల్సిందే. ఒక ఉద్యోగిగా ఆఫీసు నిబంధనలకు కట్టుబడి పనిచేయాలి. ఆఫీసు పని విషయాలను గోప్యంగా ఉంచాలి. అందుకే వర్క్‌ ఫ్రం హోమ్‌లో ఈ నియమాల్ని ఫాలో అయిపోండి.


వ్యక్తిగత ఎకౌంట్‌లు వద్దు

ఫీసు పనిని భద్రపరుచుకునేందుకు మీ వ్యక్తిగత మెయిల్‌ గూగుల్‌ డ్రైవ్‌ వాడకండి. అలా చేస్తే అనుకోని డేటా లీక్స్‌ జరగొచ్ఛు ఇది మీతో పాటు మీ కంపెనీ భద్రతకి ప్రమాదమే. అలాగే మీ వ్యక్తిగత ఫోల్డర్‌ల నుంచి వర్క్‌ ఫోల్డర్‌లను వేరుగా ఉంచండి.


ఇలా చేయొద్దు

ఫీసు పని చేస్తున్నపుడు ఫొటోలు తీసుకుని ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచడం మంచిది కాదు. దీంతో ఒక్కోసారి అనవసరపు ఇబ్బందులు వచ్చిపడొచ్ఛు ఆ సమయంలో డెస్క్‌టాప్‌పై ఆఫీసుకు సంబంధించి గోప్యంగా ఉంచాల్సిన డేటా ఉండొచ్ఛు సామాజిక మాధ్యమాల ద్వారా అది ఇతరులకు మీకు మీరే చేరవేసినట్టవుతుంది. మీ స్నేహితులతో చాట్‌ చేస్తున్న సమయంలోనూ మీ పనికి సంబంధించిన డేటా షేర్‌ చేయొద్ధు.


వీపీఎన్‌ వాడాల్సిందే

క్కువ మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తుండటంతో రక్షణలేని హోమ్‌ నెట్‌వర్క్స్‌పై వల వేసేందుకు సిద్ధంగా ఉన్నారు హ్యాకర్లు. అందుకే నాణ్యమైన వీపీఎన్‌ సర్వీసుని వాడండి.


లాక్‌ తప్పనిసరి

మీ పని పూర్తికాగానే తప్పనిసరిగా మీ సిస్టమ్‌కి లాక్‌ వేయండి. లేదంటే ఎలాగూ పిల్లలిపుడు ఇంట్లోనే ఉన్నారు. అనుకోకుండా ఏదో బటన్‌ నొక్కొచ్ఛు అది కాస్తా మీ బాస్‌కి అనవసరపు మెయిల్‌ వెళ్లడమో లేదా కొలీగ్‌కి వీడియో కాల్‌ కనెక్ట్‌ అవడమో జరగొచ్ఛు.


ఒకే బ్రౌజర్‌ వద్దు

మీ వ్యక్తిగత అవసరాలకు, ఆఫీసు పనులకు ఒకే సిస్టమ్‌ని వాడుతుంటే.. ఒకే బ్రౌజర్‌ మాత్రం వాడకండి. అది అనుకోని ఇబ్బందులకు దారితీయొచ్ఛు ఆఫీసుకు వెళ్లాక అనవసర యాడ్‌లు, సెర్చ్‌ రిజల్ట్‌లు రావొచ్ఛు సామాజిక మాధ్యమాలు వినియోగిస్తున్న బ్రౌజర్‌ కాకుండా వేరే బ్రౌజర్‌ వాడడం మంచిది.


ఆఫీస్‌ ల్యాప్‌టాప్‌ వద్దు

ఫీసు పనికి మీ వ్యక్తిగత ల్యాప్‌టాప్‌ని మాత్రమే వాడండి. దాన్ని కేవలం ఆఫీసు పనికే వినియోగించండి. వేరే సంస్థలో పని చేస్తున్న మీ భార్య లేదా స్కూల్‌ ప్రాజెక్టులు చేసే మీ పిల్లలకు ఇవ్వకండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని