ఒక్క షార్ట్‌ఫిల్మ్.. 900 అవార్డులు
ఇదీ రికార్డే!
ఒకే ఒక్క షార్ట్‌ఫిల్మ్‌తో రికార్డుల దుమారం రేపాడు బుడమల దీపక్‌రెడ్డి. ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఐఎఫ్‌ఎఫ్ పురస్కారం... వందల్లో అవార్డులు.. ప్రముఖ వేదికలపై ప్రదర్శితమైన సినిమాగా ప్రపంచ రికార్డు ఘనత... మరి ఈ విజయం వెనక ఉన్న కష్టమేంటి? అందిన ఫలితమేంటి? ఈతరంతో పంచుకున్నాడు.
మనోజ్ బాజ్‌పేయ్, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, పుష్ప సినిమా. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకల్లో అవార్డులు అందుకున్న పేర్లు ఇవి. ఈ జాబితాలో వినిపించిన మరో తెలుగు పేరు దీపక్. మనసానమ: షార్ట్‌ఫిల్మ్ దర్శకుడు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాల్లో లఘుచిత్రాల విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. ఇదొక్కటే కాదు.. మనసానమహః గెల్చుకున్న అవార్డులు, పురస్కారాలు, ప్రదర్శితమైన వేదికలు.. అన్నీ కలిపితే అక్షరాలా తొమ్మిది వందలు.
కర్నూలుకు చెందిన దీపక్‌ది విద్యావేత్తల కుటుంబం. తనకేమో సినిమాల పిచ్చి. పడ్డ ప్రతి బొమ్మా చూడాల్సిందే. దాంట్లోనే కెరియర్ అనేవాడు. ఇంట్లోవాళ్లు హడలిపోయారు. వాళ్ల బలవంతంతో బీటెక్ పూర్తి చేశాడు. కొన్నాళ్లు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. తర్వాత మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్లాడు. చదువు పూర్తై వెనక్కి తిరిగొస్తున్న సమయంలో.. సహాయ దర్శకుడిగా చేయమంటూ దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి పిలుపొచ్చింది. బీటెక్‌లో స్నేహితులతో కలిసి సరదాగా తీసిన షార్ట్‌ఫిల్మ్ ఈ అవకాశం తెచ్చిపెట్టింది. 35 రోజులు ‘ఫిదా’కి పని చేశాడు. ఆపై అతడి సినిమా కల రెట్టింపైంది.
2019లో దీపక్ భారత్ తిరిగొచ్చేశాడు. అప్పటికే రెండు లఘుచిత్రాలు తీసిన అనుభవం ఉంది. ఈసారి ఫీచర్ ఫిల్మ్‌కి తగ్గకుండా మంచి షార్ట్‌ఫిల్మ్ తీయాలనుకున్నాడు. దాన్ని తన తెరంగేట్రానికి వేదికగా మలచుకోవాలనుకున్నాడు. కానీ అది అనుకున్నంత తేలికేం కాదని అర్థమైంది. నటీనటుల ఎంపిక, బడ్జెట్, లొకేషన్, చిత్రీకరణ.. ప్రతిచోటా ఇబ్బందే ఎదురైంది. కొంచెం పేరున్న నటీనటుల్ని అడిగితే సినిమా అయితేనే చేస్తాం అన్నారు. మరోవైపు డబ్బులు పెట్టేవాళ్లు లేరు. ఆరునెలలు ప్రయత్నించి విసిగిపోయాడు. ఇక ఈ ప్రాజెక్ట్ వదిలేద్దాం అనుకుంటున్న దశలో సోదరి శిల్ప ముందుకొచ్చింది. విరాజ్ అశ్విన్, ద్రిషికా చందర్ నటించడానికి ఒప్పుకున్నారు. షూటింగ్ పూర్తై యూట్యూబ్‌లో విడుదల చేశాక మనసానమః సంచలనం సృష్టించింది. క్రిష్, సుకుమార్, అడవి శేష్, గౌతమ్ మీనన్, సందీప్ కిషన్, అనుష్క, రష్మిక మందన్న, ప్రియదర్శిలాంటి ప్రముఖులు ఎంతో మెచ్చుకున్నారు. బాగుందంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. ఈ గుర్తింపుతోనే పెద్ద బ్యానర్‌లో ఒక సినిమాకి దర్శకుడిగా సంతకం చేశాడు దీపక్.
ప్రపంచంలోని అన్ని కథలు ఇప్పటికే అన్ని సినిమాల్లో చెప్పేశారు. కొత్తగా చెప్పడానికేం లేదు. దర్శకుడు చేయాల్సింది చెప్పే విధానంలోనే తనదైన ముద్ర చూపించడం. మనసానమః ఒక మామూలు ప్రేమకథ. ఒక అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటారు, విడిపోతారు. దాన్ని కొత్త తరహాలో వెనక నుంచి ముందుకి తిరగేసి చెప్పాను. గుండెకు హత్తుకునేలా సంభాషణలు జోడించాను. నాకున్న పరిధిలోనే ఒక మంచి పాట చేర్చాను. చెప్పిన విధానం అందరికీ నచ్చింది. కానీ విజయం వెనక ఎంతో కష్టం, బాధ ఉంది. నేను సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు దగ్గరివాళ్లే చులకనగా చూశారు. ఎలా బతుకుతావ్? డబ్బులెలా వస్తాయి? అన్నారు. ఇప్పుడు వాళ్లే పొగుడుతున్నారు. ఇది యువత అందరికీ వర్తిస్తుంది. ఇష్టం, కష్టం.. రెండూ ఉంటే ఏదైనా సాధించొచ్చు.
గుర్తింపు, అవార్డుల్లో కొన్ని..
* మనసానమః ప్రఖ్యాత ఆస్కార్ 2022 షార్ట్‌ఫిల్మ్ విభాగంలో తుది పోటీకి ఎంపికైంది.
* క్రిస్టల్ ప్యాలెస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపిక.
* న్యూజెర్సీ, గార్డెన్ స్టేట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.
* కార్‌మార్థెన్ బే ఫిల్మ్ ఫెస్టివల్‌కి నామినేట్ అయింది.
* వరల్డ్‌ఫెస్ట్-హ్యూస్టన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ ఎక్స్‌పెరిమెంటల్ షార్ట్‌ఫిల్మ్ పురస్కారం.
* ప్రదర్శనలు, పురస్కారాలు, అవార్డులు.. అన్నీ కలిపితే సంఖ్య 900 దాటింది. ఇది ప్రపంచ రికార్డు. వివరాలు గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులకి పంపారు.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
Infinix Thunder Charge: ఇన్ఫినిక్స్ కొత్త ఛార్జర్.. 13 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్!
-
Politics News
Devendra Fadnavis: ఫడణవీస్.. మొదటి అగ్నివీర్..!
-
Movies News
Meena: అసత్య ప్రచారం ఆపండి.. మీనా భావోద్వేగ లేఖ
-
Politics News
Chandrababu: సీఐడీ వికృత చేష్టలు పరాకాష్ఠకు చేరాయి: చంద్రబాబు
-
World News
Ukraine: వెనక్కితగ్గని రష్యా.. అపార్ట్‌మెంట్‌పై క్షిపణి దాడి.. 18 మంది మృతి
-
General News
Andhra News: ఆ ఐదుగురి మరణానికి ఉడతే కారణమట.. నివేదిక ఇవ్వరట!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
- Pakka Commercial Review: రివ్యూ: పక్కా కమర్షియల్
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Nupur Sharma: నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలి
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..
- Andhra News: రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!