2019 మీదైన ట్వీట్!
శుభారంబానికి..
శుభారంబానికి... ఇంక రెండు రోజులే.. కొత్త ఏడాదిలో ప్రవేశించేందుకు ఉన్నవి... మరి, ఏం ప్లాన్ చేస్తున్నారు? ‘కేకు.. కిరాకు పార్టీ అన్నీ సిద్ధంగా ఉన్నాయ్‌గా!!’ అంటారా? ఆ ఒక్కరోజు సంబరం ఒకేగానీ.. మిగతా ఏడాది మాటేంటి? ఇప్పుడే కాస్త ఆలోచించండి! ఎందుకంటే.. ‘హ్యాపీ న్యూ ఇయర్’ అని ట్వీట్ చేస్తే సరిపోదు. మీరు చూడబోయే ‘న్యూ’ ఏంటో తెలుసుండాలి!‘ఆర్యా.. లేవరా. వెళ్లి స్నానం చెయ్. స్వీటు తిందువు. తర్వాత గుడికి వెళ్లాలి. లే నాన్నా!’ అంటూ అమ్మ.... ‘ఏంటమ్మా పొదున్నే..! రాత్రే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయాయిగా!! ఇంకా ఏంటి? చావగొడతావ్. కాసేపాగి లేస్తా!’ అని దుప్పటి ముసుగేసుకున్నాడు ఆర్యా. ఆ పక్కనే హాలులో పేపర్ చదువుతూ ఆర్యా వాళ్ల నాన్న .. ‘ఎందుకు లేస్తాడు. నైట్ అంతా ఫ్రెండ్స్‌తో పార్టీలు, షికార్లు కదా. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అరిచి.. అరిచి.. ఊరు మొత్తానికి చెప్పుంటాడు. అంతే.. అక్కడితో న్యూ ఇయర్ అయిపోయింది. వాళ్లకి తెలిసిందంతే!’ అని ఓ నిట్టూర్పు.
‘ఎప్పుడూ పొద్దెక్కేదాకా నిద్రలేచేదానివి కాదు. ఈ రోజు ఏంట్రా చీకటితోనే లేచావు. డబుల్‌ఎక్స్‌ఎల్ సైజు ట్రాక్‌సూట్, బూట్లతో రెడీ అయిపోయావు. నేను చూస్తున్నది నిజమేనా?’ అంటూ పూజిత వాళ్ల అమ్మ ఆనందంతో మురిసిపోయింది. అప్పటికే వాకింగ్ ముగించుకుని వచ్చిన నాన్న.. ‘న్యూ ఇయర్ రిజల్యూషన్ అనుకుంటా!. ఎన్ని రోజులో చూద్దాం. మా అయితే ఓ వారం రోజులు. తర్వాత మామూలే. ఎన్నేళ్లు చూడలేదు..’ అని! ‘ఈసారి చూడండి. నేనేంటో చూపిస్తా!’ అంటూ వెళ్లింది పూజిత.
‘దేవుడికి దండం పెట్టుకుని ఏడాదంతా మంచి జరగాలని కోరుకో. నీకున్న కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. ఇద్దరం కలగనేట్టు కలిసి బతాకలంటే నువ్వు మారాలి. లేకుంటే.. అంతే! నా మీదొట్టు.’ అంటూ అంజలీ కల్యాణ్ చేతిని తలపైన పెట్టుకుంది. ‘నా కోసం కాకపోయినా.. నీ కోసం మారతా. మన ప్రేమని గెలిపించుకోవడానికి మారతా’ అని కల్యాణ్ భరోసా ఇచ్చాడు.
- ఇలా సందర్భం ఎలాంటిదైనా.. బంధం ఏదైనా. లక్ష్యం ఎంత దూరమైనా? కన్న బిడ్డలు బాగుండాలని అమ్మకి ఆశ. వారికి బాధ్యత తెలియాలని నాన్న ధ్యాస. బంధం బలపడాలని ప్రియురాలి ప్రేమ.. ఇలా మనందరిలోనూ మార్పుని కోరుకునే వాళ్లు చుట్టూ ఉంటారు. వెతకండి. ఇల్లు... కాలేజీ.. ఆఫీస్.. ఇలా అన్ని చోట్లా. మిమ్మల్ని మిస్టర్ ఫర్‌ఫెక్ట్‌లా చూడాలనుకుంటారు వాళ్లు. వాళ్ల కోసం కాకపోయినా.. మీ కోసం మీరు! మీతో మీరు ‘హ్యాపీ న్యూ ఇయర్’ చెప్పుకొని చూడండి. ‘కొత్త’గా మిమ్మల్ని మీరే సంస్కరించుకోండి. అప్పుడు.. సెల్ఫీల చావులుండవు.. పేరెంట్స్‌కి పూడ్చలేని బాధ ఉండదు.. ప్రేమలో ఓడిన చావులుండవు.. ఎక్స్ లవర్ అని చెప్పుకొనే ఇబ్బందులుండవు..
ఏమంటారు? కొత్త ఏడాదిలో కొత్తగా పుట్టే ప్రయత్నం చేద్దాం. అందుకు ఏం చేయాలి? మీకు మీరే ఓ ట్వీట్ చేసుకోండి. అదో లైఫ్ ట్వీట్ అవ్వాలి!! చదివిన ప్రతిసారీ ప్రేరణ పుట్టాలి. ప్రేరేపించాలి.
సవాల్‌లా స్వీకరించండి
వందల పేజీలున్న పుస్తకంలో సారాన్ని వెతుకుతాం.. వందల వాక్యాలున్న వ్యాసంలో విషయాన్ని గ్రహిస్తాం.. పదుల సంఖ్యలో ఫార్ములాల్ని అప్లై చేసి మ్యాథ్స్‌లో ఎక్స్ విలువని వెలికితీస్తాం.
లెక్కకు మిక్కిలి సవాళ్లు ఎదురయ్యే జీవితం నుంచి ఏం నేర్చుకోకపోతే ఎలా? దోస్త్ మేరా దోస్త్ అంటారు.. వారం తిరిగేలోపు కటీఫ్ చెప్పేస్తారు. పదహారు ప్రాయంలో నాకొక గార్ల్‌ఫ్రెండ్ కావాలంటారు.. పదిరోజులకే బ్రేకప్ అనేస్తారు.. వచ్చే సెమ్‌లో టాప్ చేయాలనుకుంటారు.. ఎగ్జామ్ ముందు రోజే సినిమాకెళ్తారు.. చాలా ఎక్స్‌ప్రెసివ్ అంటారు.. మరుక్షణమే ముఖం మాడ్చుకుని కూర్చుంటారు.. అప్పుడే సూపర్ అని ట్వీట్ చేస్తారు.. కొద్ది నిమిషాలకే ఫీలింగ్ బోర్ అంటూ షేర్ చేస్తారు.. ఎన్నాళ్లు... ఎన్నేళ్లిలా? ఈ తరహా లైఫ్‌స్టైల్‌కి చెక్ పెట్టాల్సిందే. ఎందుకంటే.. ఎక్స్ వాల్యూని వెతికే క్రమంలో మీ విలువని తెలుసుకోకపోవడం. మీకు మీరే అర్థంకాకపోవడం.. మీ గురించి మీరు తెలుసుకున్నాకే ముందున్న ప్రపంచాన్ని అంచనా వేయగలరు!! ఆలోచించాల్సిన టైమ్ వచ్చింది. అందుకే ఈ లైఫ్ ట్వీట్స్. ప్రపంచంతో పంచుకోవడానికి కాదు.. మీతో మీరు షేర్ చేసుకోవడానికి.. వాటిపై మీరే కామెంట్ చేయడానికి!! పదహారు ప్రాయంలో.. పడిలేచే వయసులో వీటి అవసరం ఎంతో ఉంది!! మీరున్న మానసిక స్థితికి సరిపడే వాటిని ఎంచుకోండి. లేదంటే.. మీకు మీరుగానే ఓ ట్వీట్‌ని రాసుకోండి. ల్యాపీ డెస్క్‌టాప్‌పైనో.. ఫోన్ వాల్‌పేపర్‌గానో పెట్టుకోండి. నిత్యం మీకు కనిపించేలా!!
నా స్మైల్.. నేనిచ్చే కాంప్లిమెంట్స్.. ఇతరుల్ని ప్రత్యేకమైన వ్యక్తులుగా మార్చొచ్చు. గమ్యాన్ని చేరడంలో అవెంతో ప్రోత్సాహం కావచ్చు Smile and show happiness when you meet people |
బంధాన్ని కలుపుకొని వెళ్లడం ఓ ప్రయాణం ఎక్కాలి.. దిగాలి.. అంతేగానీ.. చిరాకులు పరాకులతో మధ్యలో దిగేయడం సరికాదు! కడదాకా కలిసే ప్రయాణం చేయాలి. Relationships are to be worked on. |
లక్కీ.. అన్‌లక్కీ ఉండవు. రైట్ టైమ్‌లో అవకాశం తలుపు తడుతుంది. నా శక్తిని నమ్మి దాన్ని వాడుకుంటా. Believe in yourself. |
ఏదైనా మూర్ఖంగా తిరస్కరించను. వచ్చిన అవకాశం ఏదైనా వాడుకునే ప్రయత్నం చేయాలి. Do not blindly reject anything |
ఇష్టంగా అభిరుచులకు అనుగుణంగా పని చేస్తా. కెరీర్ ఎత్తుపల్లాల్లో అది నాకెంతో బలం. Cultivate a passion |
పాసయ్యా.. ఫెయిలయ్యా.. తప్పులున్నాయి.. ఒప్పులున్నాయి.. అందుకే మనసు మారడాన్ని తప్పనుకోను!! Do not worry about changing your mind |
నేనేం సెలబ్రిటీని కాదు.. నా గురించి మాట్లాడుకోవడానికి! ఒకవేళ మాట్లాడుకున్నా.. అది వాళ్ల టైమ్‌పాస్ కోసమే! Distance yourself from a problem for a fresher perspective. |
నన్ను నన్నుగా ఎలా స్వీకరించాలనుకుంటానో... ఇతరుల్ని అలానే స్వీకరిస్తా... ఎల్లప్పుడూ ప్రేమిస్తా!! Learn to accept people you love as they are |
నాకెన్నో లక్ష్యాలు. దారిపొడవునా. గమ్యాన్ని చేరేలోపు అవన్నీ మైలురాళ్లే Have a goal |
నేనో బ్రాండ్. నాతో కలవాలన్నా. నన్ను గెలవాలన్నా కాస్త శ్రమించాలి. Dignity is important |
నాకెన్నో పనులు. కాలం కుళ్లుకునేంతలా పోటీ పడుతూనే ఉంటా. Keep a daily schedule |
నాదో నిస్వార్థ సాయం. అది నాకు నేను ఇచ్చుకునే బహుమానం Treat that as a gift to yourself |
నాదో అత్యుత్తమ ప్రదర్శన అయితే.. అందుకు వాడిన డ్రగ్స్ సహనం, ఓర్పు.. Things that are easily achieved are not necessarily the best. |
నాకై నేను. నా మనుగడకై పోరాటం. మంచోడిగా.. మంచిని సపోర్టు చేసే మనిషిగా!! Stand up for yourself |
ఒత్తిడి నా దరి చేరదు. భూమేమీ బద్దలవ్వలేదుగా.. నేనేం కూరుకుపోలేదుగా.. నిల్చునే ఉన్నాగా. నడక సాగితే దారెటో తెలుస్తుంది! Try not to stress |
రేపనేది ఇంకో రోజు. అది నాదో కాదో. ఈ రోజు ఏం చేయాలో అది చేస్తా. Tomorrow is another day |
నన్ను నేను క్షమించుకోలేని తప్పేంటంటే.. ఇతరుల మనసుని గాయపర్చడం. Don’t hurt others |
చర్చలో ఎప్పుడూ నేనే నెగ్గాలనుకోను. ఇతరుల్నీ గెలిపిస్తుంటా. వారి కళ్లలో నాపై ప్రేమ కిక్కిస్తుంది. Don’t make a point of winning every argument |
నా ప్రతి స్పందనకు సమయం కావాలి.. మైండ్ మనసుతో చర్చించాలిగా! Don’t respond immediately |
సమస్యని చూసి పారిపోను.. కాస్త దూరం జరిగి నిశితంగా పరిశీలిస్తా. విమానంలో నుంచి సముద్రాన్ని చూసినట్టుగా... నదిలా అందంగా మరోలా కనిపిస్తుంది!! Distance yourself from a problem for a fresher perspective. |
నా స్వభావానికి విరుద్ధంగా ముందుకు సాగడం అంటే.. 3జీ నెట్‌వర్క్ మాత్రమే ఉన్నచోట 4జీ కోసం వెతికినట్టే! Follow your instinct. |
చదవడం ఒక్కటే ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం Read. Reading educates you and insulates you |
నాపై అంచనాలు ఉంటాయ్. వాస్తవ దృక్పథంలో చూస్తే కొన్ని అందుకోలేం. అలాంటప్పుడు కాస్త చికాకుగా అనిపించడం సహజం. Learn to manage expectations |
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక
-
General News
AP High court: అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు
-
Movies News
IPL 2023: ఐపీఎల్ వేడుకల్లో రష్మిక, తమన్నా హంగామా.. ‘నాటు’ స్టెప్పులు అదుర్స్ అనాల్సిందే!
-
World News
Heartbreaking Story: మా అమ్మ కన్నీటితో డైరీలో అక్షరాలు తడిసిపోయాయి..!
-
World News
ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ మాయం..ఎయిర్టాగ్తో నిందితుడిని గుర్తించిన ప్రయాణికుడు