ఆయుష్మాన్‌నవ

డ్రాప్డ్‌ షోల్డర్‌ ఓవర్‌సైజ్డ్‌ బాంబర్‌ కోటు, నాలుగు ప్యాకెట్ల ఖాకీ జీన్స్‌, ‘ట్రైనర్‌ హీ’ బూట్లు.. నటనతో అదరగొట్టే బాలీవుడ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా కొత్త ఆహార్యమిది.

Published : 25 May 2019 01:48 IST

డ్రాప్డ్‌ షోల్డర్‌ ఓవర్‌సైజ్డ్‌ బాంబర్‌ కోటు, నాలుగు ప్యాకెట్ల ఖాకీ జీన్స్‌, ‘ట్రైనర్‌ హీ’ బూట్లు.. నటనతో అదరగొట్టే బాలీవుడ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా కొత్త ఆహార్యమిది. ఇందులో వింతేం ఉందంటారా? తను వేసుకుంది అచ్చంగా అమ్మాయిల షూస్‌. ఇష్టపడ్డవాళ్లు ఇన్‌స్టాగ్రామ్‌లో అతడి ఫొటోకి లైక్‌ వేసుకుంటున్నారు. నచ్చనివాళ్లు ఇదేం ఫ్యాషన్‌ ట్రెండ్‌ అంటున్నారు. ఆయుష్మాన్‌ మాటేంటంటే ‘ట్రెండ్‌ని ఫాలో కావడం కాదు.. ట్రెండ్‌ సెట్టర్‌గా నిలవడం నాకిష్టం. అయినా అబ్బాయిల డ్రెస్‌ల్ని అమ్మాయిలు తొడిగినపుడు అమ్మాయి షూస్‌ మేమెందుకు ధరించకూడదు. ఇవి యూనిసెక్స్‌ షూస్‌’ అంటున్నాడు. ఫ్యాషన్‌ సెన్స్‌లో అది పాయింటే కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని