తల‘కట్స్‌’ స్టైల్‌

యువత తలకట్టుపై ఎంతో శ్రద్ధ పెడుతుంది. ఎప్పటికప్పుడూ యువకులు ట్రెండీగా దాన్ని తీర్చిదిద్దుతుంటారు. కొత్త లుక్‌లోకి మారడానికి హెయిర్‌కటింగ్‌ను మించిన సాధనం లేదని నమ్ముతారు.

Published : 15 Jun 2019 00:21 IST

యువత తలకట్టుపై ఎంతో శ్రద్ధ పెడుతుంది. ఎప్పటికప్పుడూ యువకులు ట్రెండీగా దాన్ని తీర్చిదిద్దుతుంటారు. కొత్త లుక్‌లోకి మారడానికి హెయిర్‌కటింగ్‌ను మించిన సాధనం లేదని నమ్ముతారు. అందుకే ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. అలా వచ్చినవే లెంగ్త్‌, షార్ట్‌, సైడ్‌షార్ట్‌, హిప్పీ, షార్ట్‌ ఫార్మల్‌ స్టైల్స్‌. ఇప్పుడు కట్‌్్స  స్టైల్‌ యువతను ఊపేస్తోంది. సైడ్‌ షార్ట్‌, బ్యాక్‌ షార్ట్‌ మోడల్స్‌లో ఈ కట్స్‌తో ఆకట్టుకుంటున్నారు. కట్స్‌లోనూ డిజైన్స్‌ ఫాలో అవుతున్నారు. కొందరు స్ట్రయిట్‌ లైన్స్‌ వేసుకుంటే... ఇంకొందరు తమకు నచ్చిన ఆకృతులను గీయించుకుంటున్నారు. ఈ కట్స్‌ మోడల్‌ తొలుత జర్మనీలో మొదలై ప్రపంచమంతా విస్తరించింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ యువత దీన్ని ఫాలో అవుతున్నారు. ఇటీవల ఢీ షోలో డ్యాన్స్‌ మాస్టర్‌ శేఖర్‌ ఈ లుక్‌తో కన్పించి ఆకట్టుకున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని