అందం అసమానం

ఎప్పుడూ టీషర్టులు.. జీన్సే కాదు. సందర్భానికి తగినట్టుగా రెడీ అవడం కూడా కుర్రకారుకి బాగా తెలుసు. ముఖ్యంగా పండగలకీ, శుభకార్యాలకి ఎక్కువ మంది ఎంపిక కుర్తానే. అందుకే మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లు వస్తూనే ఉన్నాయి...

Updated : 24 Aug 2019 06:46 IST

ఫ్యాషన్‌

ఎప్పుడూ టీషర్టులు.. జీన్సే కాదు. సందర్భానికి తగినట్టుగా రెడీ అవడం కూడా కుర్రకారుకి బాగా తెలుసు. ముఖ్యంగా పండగలకీ, శుభకార్యాలకి ఎక్కువ మంది ఎంపిక కుర్తానే. అందుకే మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ట్రెండీ డిజైన్‌ ఒకటి యువతని ఆకట్టుకుంటోంది. వాటిని ఫ్యాషన్‌ పరిభాషలో ‘అసెమెట్రిక్‌ కుర్తాస్‌’ అని పిలుస్తున్నారు. సెలబ్రిటీల నుంచి సాధారణ యువత వరకూ వీటినిపుడు తెగ ధరించేస్తున్నారు. మరి మీరూ ఇలాంటి కుర్తాలను ట్రై చేద్దామనుకుంటే కొన్ని టిప్స్‌ పాటించాల్సిందే..! హాఫ్‌ కట్‌ కుర్తాల్లో సింపుల్‌ కలర్స్‌నే ఎంచుకోండి. వీటిపైకి స్ట్రెయిట్‌ కట్‌ ప్యాంట్స్‌ వాడితే బాగుంటుంది. వేడుకను బట్టి షూ లేదా ఓపెన్‌ టాయ్‌ సాండిల్స్‌, సాక్స్‌ లేకుండా క్లోజ్డ్‌ ఫార్మల్‌ షూ మంచి ఛాయిస్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని