జిల్జిల్ జిగేలు రాజా..
మీరో పార్టీకి వెళ్లారనుకోండి... అక్కడ అందరి కళ్లూ మీ టీ షర్టు మీదే ఉండాలి. కొందరు దాన్ని చూసి అవాక్కవ్వాలి. అలాంటి టీ షర్టు వేసుకున్నందుకు మీకు గర్వంగా... పక్కవాళ్లకు అసూయగా ఉండాలి. పార్టీ ఇచ్చే స్నేహితుడూ మీ టీ షర్టును చూసి తెగ కుళ్లుకోవాల్సిందే. ఎందుకంటే...
ఫ్యాషన్
మీరో పార్టీకి వెళ్లారనుకోండి... అక్కడ అందరి కళ్లూ మీ టీ షర్టు మీదే ఉండాలి. కొందరు దాన్ని చూసి అవాక్కవ్వాలి. అలాంటి టీ షర్టు వేసుకున్నందుకు మీకు గర్వంగా... పక్కవాళ్లకు అసూయగా ఉండాలి. పార్టీ ఇచ్చే స్నేహితుడూ మీ టీ షర్టును చూసి తెగ కుళ్లుకోవాల్సిందే. ఎందుకంటే... పార్టీ తనదైతే అందరి కళ్లూ మీ మీదే ఉంటాయి. అయినా మీరు వేసుకున్న టీ షర్టులాంటిది ఎవరూ వేసుకోకపోతే ఆ కిక్కే వేరప్పా. అలాంటి కిక్కు మీ సొంతం కావాలంటే మీ దగ్గర ఇలాంటి ‘గ్లో ఇన్ డార్క్ టీ షర్టులు’ ఉండాల్సిందే. వీటి ప్రత్యేకత ఏమిటంటే... ఈ డిజైన్ల మీద చీకట్లో మెరిసే ఫ్లోరోసెంట్ పెయింట్‌ను వేస్తారు. దాంతో పగలు సాదాగా కనిపించే ఈ డిజైన్ రాత్రిళ్లు మాత్రం మెరుస్తుంది. మీరు కనిపించకుండా డిజైన్ మాత్రమే చీకట్లో మెరుస్తూ, కదులుతుంటే భలే గమ్మత్తుగా ఉంటుంది కదా. వీటిలో జంతువుల బొమ్మలు, అస్థిపంజరాలూ ఉన్నాయి. ఇవి వేసుకుని స్నేహితులను ఆశ్చర్యపరుస్తారో... భయపెడతారో అంతా మీ ఇష్టం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్‌లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్‌ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?