సగం... సగం సూపర్‌

మీరు సింపుల్‌గా టీషర్టు మాత్రమే వేసుకుంటారు. అయినా మీ లుక్‌ మొత్తం మారిపోతుంది. అందరూ మిమ్మల్ని ఆసక్తిగా గమనిస్తుంటారు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా... అయితే ఒక్కసారి ఈ ‘హాఫ్‌ అండ్‌ హాఫ్‌’ టీషర్టులను ప్రయత్నించి చూడండి...

Published : 21 Sep 2019 00:31 IST

ఫ్యాషన్‌

మీరు సింపుల్‌గా టీషర్టు మాత్రమే వేసుకుంటారు. అయినా మీ లుక్‌ మొత్తం మారిపోతుంది. అందరూ మిమ్మల్ని ఆసక్తిగా గమనిస్తుంటారు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా... అయితే ఒక్కసారి ఈ ‘హాఫ్‌ అండ్‌ హాఫ్‌’ టీషర్టులను ప్రయత్నించి చూడండి. వీటిల్లో సగం ఒక రంగు ఉంటే.. సగం మరో రంగు ఉంటుంది. కొన్ని నిలువుగా రెండు రంగులు ఉంటే.. మరికొన్ని అడ్డంగా రెండు రంగులు ఉంటాయి. దాంతో మొత్తంగా మీ లుక్కే మారిపోతుంది. కొన్నింటిలో అయితే సగం రంగు, సగం డిజైన్‌ ఉంటుంది. దాంతో లెఫ్ట్‌టర్న్‌ ఇచ్చుకుంటే ఒక హీరోలా... రైట్‌టర్న్‌ ఇచ్చుకుంటే మరో హీరోలా కనిపిస్తారు. అబ్బా... మీరు మరీ చెబుతారుగానీ టీషర్టుకు అంత సీను ఎక్కడుందీ అంటారా... అయితే వీటిని వేసుకుంటే ఆ అభిప్రాయాన్ని వెంటనే మార్చేసుకుంటారు. సాదాసీదా టీషర్టులకు మించి ఇవి మీ అందాన్ని పెంచేస్తాయి. అప్పుడు నలుగురిలో అందంగా, ఆకర్షణీయంగా కనిపించే మిమ్మల్ని చూసి అందరూ ఫిదా కావాల్సిందే.
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని