ముఖానికి తగ్గట్టు..!

కళ్లజోడు.. కొందరికి అనివార్యమైతే.. ఇంకొందరికి అదనపు అలంకారం. ఏది ఏమైనా ముఖానికి తగిన కళ్లజోళ్లను ఎంపిక చేసుకోవడం ఓ ఆర్టే! ఎప్పుడూ వాడిన ఫ్రేమ్‌నే వాడుతూ బోర్‌ ఫీలవ్వకుండా.. కొత్త వాటిని ప్రయత్నించండి. అంతేకాదు.. ఫ్రేమ్‌ల ఎంపికలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి...

Published : 28 Sep 2019 01:15 IST

ఫ్యాషన్‌

కళ్లజోడు.. కొందరికి అనివార్యమైతే.. ఇంకొందరికి అదనపు అలంకారం. ఏది ఏమైనా ముఖానికి తగిన కళ్లజోళ్లను ఎంపిక చేసుకోవడం ఓ ఆర్టే! ఎప్పుడూ వాడిన ఫ్రేమ్‌నే వాడుతూ బోర్‌ ఫీలవ్వకుండా.. కొత్త వాటిని ప్రయత్నించండి. అంతేకాదు.. ఫ్రేమ్‌ల ఎంపికలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ముఖానికి తగినవి ఏంటో చూడాలి.. అప్పుడే ట్రెండీ లుక్‌ మీ సొంతమవుతుంది. చతురస్రాకారపు ముఖం అయితే గుండ్రని అద్దాలతో కూడినవి అయితే బాగుంటుంది. ‘సర్కిక్యులర్‌ స్పెక్టకిల్స్‌’గా వీటిని పిలుస్తున్నారు. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్‌తో కొత్త డిజైన్లు అందుబాటులోకి వస్తున్నాయి. గుండ్రని ముఖమైతే దీర్ఘ చతురస్రాకారపు ఫ్రేమ్‌లు బాగుంటాయి.  త్రిభుజాకారపు ముఖానికి ‘ఏవియేటర్‌’ మోడల్‌ ఫ్రేములు బాగా నప్పుతాయి. ఫ్రేము పైభాగం వెడల్పుగా కనిపిస్తూ.. కిందికి వచ్చేసరికి లైట్‌గా ఉండాలి. కోల ముఖానికి ఇంచుమించు అన్ని రకాల మోడళ్లు నప్పుతాయి. ఎక్కువగా చతురస్రం, దీర్ఘచతురస్రాకారపు ఫ్రేమ్‌లను సెలెక్ట్‌ చేయొచ్చు.


*రూ.3,000.



* రూ.2,500.



* రూ.4,500


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు