హెంప్‌సొంపులు మీ సొంతం

ఒకటో, రెండో గ్యాడ్జెట్‌లు పెట్టుకుని తిరగడం.. నచ్చిన ఫ్యాషన్స్‌ ఏవో ఫాలో అవడం.. తోచిందేదో చేయడం.. ఇంతేగా నేటితరం తీరు ...

Published : 12 Oct 2019 00:38 IST

ఫ్యాషన్‌

కటో, రెండో గ్యాడ్జెట్‌లు పెట్టుకుని తిరగడం.. నచ్చిన ఫ్యాషన్స్‌ ఏవో ఫాలో అవడం.. తోచిందేదో చేయడం.. ఇంతేగా నేటితరం తీరు అనుకుంటే పొరపాటే. చాలా నిశితంగా అన్నీ ఆలోచిస్తున్నారు.. పాటిస్తున్నారు.. అవసరం అయితే ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఫ్యాషన్స్‌కి కొత్త నిర్వచనాన్ని ఇస్తున్నారు. పర్యావరణ హితాన్ని కోరుతూ అందుకు అనువైన ఉత్పత్తులకే ఓటేస్తున్నారు. వాటిలో హెంప్‌ మొక్కల నారతో తయారు చేసినవి ఇప్పుడు ట్రెండీగా మారుతున్నాయ్‌. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ధరించే దుస్తుల మన్నిక ఉతికిన కొద్దీ తగ్గుతుంది. కానీ హెంప్‌తో తయారు చేసినవి ఉతికే కొద్దీ మరింత నాణ్యమైన లుక్‌తో కనిపిస్తాయి. చాలా సౌకర్యంగానూ ఉంటాయి. టీషర్టులు, ఫార్మల్‌ షర్టులు, ప్యాంట్‌లు పలు రకాల డిజైన్లలో యువతని ఆకట్టుకుంటున్నాయి. వచ్చే చలికాలంలో ధరించేందుకు అనువైన జర్కిన్లూ మంచి ఎంపికే. ఇక శుభకార్యాలకు హెంప్‌తో తయారైన బ్లేజర్లతో మిలీనియల్స్‌ తెగ సందడి చేస్తున్నారు. కేవలం దుస్తులే కాదు. హెంప్‌తో తయారు చేసిన బూట్లు, చెప్పులూ మార్కెట్‌లో అందుబాటులోకొచ్చాయి. యువత స్టైలింగ్‌కి వాడే మంకీ క్యాప్‌లు, హ్యాండ్‌ బ్యాగులు, ల్యాప్‌టాప్‌ బ్యాగులు, వాచ్‌లు ఆన్‌లైన్‌ అంగళ్లలో దర్శనమిస్తున్నాయి. మరెందుకు ఆలస్యం.. ట్రెండ్‌ని ఫాలో అవుతూ ‘ఎకో ఫ్రెండ్స్‌’ అనిపించుకోండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని