బ్రేక్‌ లేకుంటే హెల్త్‌కి బ్రేకప్‌!

‘ఏ వస్తువుల కుండా ఒక్క పది నిమిషాలైనా ఉండలేరు?’ అని అడిగితే యావత్‌ యువత ‘స్మార్ట్‌ ఫోన్‌’ అని ఠక్కున చెప్పేస్తారు. అంతలా  ఫోన్‌ని వాడేస్తున్నారు. యాప్‌లు.. గేమ్‌లు.. ట్వీట్‌లు.. మెసేజింగ్‌లు.. మల్టీ టాస్కింగ్‌తో మస్తీ చేస్తున్నారు.....

Published : 19 Oct 2019 00:43 IST

‘ఏ వస్తువుల కుండా ఒక్క పది నిమిషాలైనా ఉండలేరు?’ అని అడిగితే యావత్‌ యువత ‘స్మార్ట్‌ ఫోన్‌’ అని ఠక్కున చెప్పేస్తారు. అంతలా  ఫోన్‌ని వాడేస్తున్నారు. యాప్‌లు.. గేమ్‌లు.. ట్వీట్‌లు.. మెసేజింగ్‌లు.. మల్టీ టాస్కింగ్‌తో మస్తీ చేస్తున్నారు. అయితే, ఇలా బ్రేక్‌ లేకుండా  వాడితే ఆరోగ్యానికి బ్రేకప్‌ చెప్పుకున్నట్టేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. మితిమీరి ఫోన్‌ వాడడం ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరిస్తున్నారు.
* నిద్ర హుష్‌కాకి..
చాలామంది రాత్రి పడుకునే ముందు ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, వాట్సప్‌ ఇలా రకరకాల సామాజిక మాధ్యమాల్లో కాసేపు గడిపి నిద్రకు  ఉపక్రమిస్తారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. కంప్యూటర్‌, సెల్‌ఫోన్‌ తెరలు కంటికి దగ్గరగా ఉండడం వల్ల నిద్ర సమస్యలు అధికమవ ±తున్నాయి. గాఢ నిద్రకి ఇది ఏ మాత్రం మంచిది కాదు.
* బహు బ్యాక్టీరియా ఎటాక్‌
ఎక్కడబడితే అక్కడ ఫోన్‌ పెట్టేస్తున్నాం. దీంతో దానిపై ఎన్నో రకాల బ్యాక్టీరియా చేరుతుంది. ఫోన్‌ మాట్లాడేటప్పుడు, దగ్గరగా  చూస్తున్నప్పుడు నోరు, ముక్కు ద్వారా శరీరంలోకి బ్యాక్టీరియా చేరుతుంది.
* చూపునకు చెక్‌
ఫోన్‌ని ఎక్కువగా వాడితే దూరపు చూపు దెబ్బతింటుందని డాక్టర్లు చెబుతున్నారు. కేవలం కంటి చూపు మాత్రమే కాదు. తలని ఎక్కువ సమయం ఒకే స్థితిలో ఉంచడం వల్ల మెడపై బరువు పడుతుంది. దీంతో మెడనొప్పి వచ్చే అవకాశాలూ ఎక్కువే.
* సంబంధాలు చెడుతున్నాయ్‌
పదే పదే ఫోన్‌ వినియోగంతో మానవ సంబంధాలూ దెబ్బతింటాయి. ఇతరులతో మాట్లాడటం మానేసి టెక్ట్స్‌ చేస్తున్నారు. ఎమోజీల్లోనే  ఎమోషన్స్‌ చూపిస్తున్నారు. దీంతో చుట్టూ ఉన్న మనుషులు దూరం అవుతున్నారు.
* ప్రశాంతత కరవు
ఎప్పుడూ ఏదో ఒక ఆందోళన. లైక్‌లు లేవనో.. కామెంట్స్‌ కాలేదనో. దీంతో రియల్‌ లైఫ్‌లో ఎన్నో మానసిక సమస్యలు. చేస్తున్న పనిపై ఫోకస్‌  పెట్టలేకపోవడం. డెడ్‌లైన్‌లోపు లక్ష్యాల్ని చేరుకోలేకపోవడం.. ఇలా చెప్పాలంటే ఎన్నో!
* ప్రమాదాల కోరల్లోకి...
ఫోన్‌ వాడుతూ వాహనాలు నడపడం. యువత ఎక్కువగా ప్రమాదాల్లో పడడానికి ప్రధాన కారణం. రాను రానూ ఇవి ఇంకా ఎక్కువ అవ ±తున్నాయి. డ్రైవింగ్‌ చేస్తూనే కాకుండా... ఫోన్‌ని చూసుకుంటూ నడుస్తూ.. వచ్చే వాహనాలను గమనించక ప్రమాదాల బారిన పడుతున్నారు.  టీనేజర్లూ జర భద్రం!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని