కాంతితో ఛార్జింగ్‌

ఇష్టమైన పాటలు వింటున్నప్పుడో.. ఆత్మీయులతో మాట్లాడుతున్నప్పుడో హెడ్‌ఫోన్‌లో ఛార్జింగ్‌ ఖాళీ! అప్పుడు హెడ్‌ఫోన్‌ని అడాప్టర్‌కి కనెక్ట్‌ చేయడం.. గంటపాటైనా ఛార్జింగ్‌ పెట్టడం.. ఇదంతా కాస్త ఇబ్బందే. అసలు ఛార్జింగ్‌ సమస్యే రాకుండా హెడ్‌ఫోన్‌లు కాంతిని గ్రహించడం ద్వారా ఛార్జ్‌ అయితే!

Published : 21 Dec 2019 01:12 IST

టెక్‌టాక్‌

ఇష్టమైన పాటలు వింటున్నప్పుడో.. ఆత్మీయులతో మాట్లాడుతున్నప్పుడో హెడ్‌ఫోన్‌లో ఛార్జింగ్‌ ఖాళీ! అప్పుడు హెడ్‌ఫోన్‌ని అడాప్టర్‌కి కనెక్ట్‌ చేయడం.. గంటపాటైనా ఛార్జింగ్‌ పెట్టడం.. ఇదంతా కాస్త ఇబ్బందే. అసలు ఛార్జింగ్‌ సమస్యే రాకుండా హెడ్‌ఫోన్‌లు కాంతిని గ్రహించడం ద్వారా ఛార్జ్‌ అయితే! అదెట్టా.. అలా సాధ్యమేనా? అనే సందేహం అక్కర్లేదు. జేబీఎల్‌ సంస్థ సరికొత్త మోడల్‌ హెడ్‌సెట్‌ని మార్కెట్‌లోకి తేనుంది. పేరు JBL Reflect Eternal. అది సౌరశక్తితో ఛార్జ్‌ అవుతుంది. హెడ్‌ఫోన్‌ని ధరించి ఉంటే చాలు. మీరు పగటి పూట బయట తిరిగినంత సమయం ఛార్జ్‌ అవుతూనే ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పటికీ గదిలోని కాంతిని గ్రహిస్తూ కూడా ఛార్జ్‌ అవుతుంది. గంటన్నర పాటు వెలుతురులో ఉంటే 68 గంటల సమయం మ్యూజిక్‌ వినేంత ఛార్జ్‌ అవుతుంది. హెడ్‌ఫోన్‌ని యూఎస్‌బీ కేబుల్‌తోనూ ఛార్జ్‌ చేయొచ్చు.                                      


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని