నయా ట్రెండ్‌..నడిచే బ్రాండ్‌

కాలానికి తగ్గట్టు వేసే డ్రెస్సింగ్‌లో స్టైల్‌ని జోడిస్తే.. నయా ట్రెండ్‌ మీదవుతుంది. ట్రెండ్‌ని ఫాలో అవడమే కాదు ట్రెండ్‌ని    సెట్‌ చేయొచ్చు కూడా..! సింపుల్‌గా ట్రెండీ డ్రెస్సింగ్‌ వేసేద్దామనుకుంటే వీటిపై ఓ లుక్కేయండి....

Published : 04 Jan 2020 01:01 IST

కాలానికి తగ్గట్టు వేసే డ్రెస్సింగ్‌లో స్టైల్‌ని జోడిస్తే.. నయా ట్రెండ్‌ మీదవుతుంది. ట్రెండ్‌ని ఫాలో అవడమే కాదు ట్రెండ్‌ని    సెట్‌ చేయొచ్చు కూడా..! సింపుల్‌గా ట్రెండీ డ్రెస్సింగ్‌ వేసేద్దామనుకుంటే వీటిపై ఓ లుక్కేయండి.
ట్రాపర్‌ హాట్స్‌, బీని క్యాప్‌లు
మంకీ క్యాప్‌లు... ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. చిన్నా.. పెద్దా తేడా లేకుండా చలికాలంలో ధరించేస్తాం. అవి ఓల్డ్‌ ట్రెండు కదా అనుకునేవారు స్టైలింగ్‌ వెర్షన్‌ని మార్చండి. ట్రాపర్‌ హ్యాట్స్‌, బీని క్యాప్‌లను ధరించండి. ఇప్పుడివే మిలీనియల్స్‌ ఫాలో అయ్యేది. సౌకర్యంగా ఉండటంతో పాటు ట్రెండీ లుక్‌ సొంతమవుతుంది.
ఫ్లీస్‌ జాకెట్స్‌
ఉన్నితో తయారు చేసిన జాకెట్లు ఆధునిక హంగులు జోడించుకొని తిరిగి వస్తున్నాయ్‌. అవే ఫ్లీస్‌ జాకెట్స్‌. చలి కాలంలో ఇవి సరైన ఎంపిక. అవి మీకు పెద్దగా నప్పవు అనుకుంటే ఫ్లీస్‌ లైన్డ్‌ డెనిమ్‌ జాకెట్‌లు, విండ్‌బ్రేకర్స్‌ని ఎంచుకోవచ్చు. బోల్డ్‌ మెటాలిక్‌ రంగుల్ని యువత ఎక్కువ ధరిస్తోంది.
చేతి గ్లౌజులు
వేళ్లను వేరు చేస్తూ ధరించే గ్లౌజ్‌ల కంటే.. వేళ్లన్నీ కలిసుంచేలా చేసే గ్లౌజ్‌లే చలికాలం సరైన ఎంపిక. ఇప్పుడిదే ఫ్యాషన్‌ కూడా. వీటిని ‘మిటెన్స్‌’ అని పిలుస్తున్నారు. మరి, వాటితో ఫోన్‌ని ఎలా వాడాలి? అనే సందేహం వస్తే.. అందుకు తగినట్టు ‘ఫింగర్‌లెస్‌ మిటెన్‌ గ్లౌజ్‌’లను ఎంపిక చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని