కునుకుకో కోటా..

పగలు.. రాత్రి.. ఎప్పుడు నిద్రపోతున్నారో.. ఏమో! అనిపిస్తుంది నేటి మిలీనియల్‌ ఉద్యోగుల్ని చూస్తే.. నిత్యం స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, టెక్‌ గ్యాడ్జెట్స్‌తో కుస్తీ పడుతూనే ఉంటారు. అందుకేనేమో.. ఇప్పుడు కొలువుల్లో కొత్త కోటాకి మిలీనియల్స్‌ తెరతీస్తున్నారు. అదే..

Published : 01 Feb 2020 01:23 IST

పగలు.. రాత్రి.. ఎప్పుడు నిద్రపోతున్నారో.. ఏమో! అనిపిస్తుంది నేటి మిలీనియల్‌ ఉద్యోగుల్ని చూస్తే.. నిత్యం స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, టెక్‌ గ్యాడ్జెట్స్‌తో కుస్తీ పడుతూనే ఉంటారు. అందుకేనేమో.. ఇప్పుడు కొలువుల్లో కొత్త కోటాకి మిలీనియల్స్‌ తెరతీస్తున్నారు. అదే.. ‘క్యాట్‌ నాప్‌’. తిన్నాకో.. బాగా అలసటగా అనిపించినప్పుడో.. ఓ 20 నిమిషాల కునుకు అవసరం అంటున్నారు. అప్పుడే ఉల్లాసంగా పని చేయడం సాధ్యం అని వర్క్‌ స్టేషన్స్‌లో అందుకు తగిన సౌకర్యాల్ని సమకూర్చుకుంటున్నారు. నాసా, గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఉబర్‌, సామ్‌సంగ్‌ వంటి పలు ప్రముఖ సంస్థలు ఉద్యోగుల కోసం నాప్‌ రూమ్స్‌ని కూడా ఏర్పాటు చేశాయి. అలసటగా అనిపించినప్పుడు ఆ గదుల్లోకెళ్లి సేదతీరొచ్చట.. దీని ద్వారా ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేయగలరని నమ్ముతున్నారట. అంతేకాదు వారిలో జ్ఞాపకశక్తి పెరిగి, సరికొత్త అంశాలు, వినూత్నంగా ఆలోచించే సామర్థ్యం పెరుగుతుందట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు