నీలి కళ్లజోడు

ప్రొఫెషనల్‌గా నల్ల కళ్లజోళ్లు పెట్టుకునే రోజులు పోయాయి. పలు రంగుల ఫ్రేముల్ని పెట్టేస్తూ లుక్‌ని భిన్నంగా మార్చేస్తున్నారు నేటి తరం. ముఖ్యంగా నీలి రంగు కళ్లజోళ్లంటే ఆసక్తి చూపుతున్నారు...

Published : 08 Feb 2020 01:02 IST

ఫ్యాషన్‌

ప్రొఫెషనల్‌గా నల్ల కళ్లజోళ్లు పెట్టుకునే రోజులు పోయాయి. పలు రంగుల ఫ్రేముల్ని పెట్టేస్తూ లుక్‌ని భిన్నంగా మార్చేస్తున్నారు నేటి తరం. ముఖ్యంగా నీలి రంగు కళ్లజోళ్లంటే ఆసక్తి చూపుతున్నారు. మీకూ ఒకే విధమైన కళ్లజోడు వాడి బోర్‌ కొడితే.. ఓసారి రంగురంగుల ఫ్రేమ్స్‌ని ప్రయత్నించండి. మీ స్టైల్‌ని ట్రెండీగా మార్చేయండి.
* ఆఫీసుకెళ్లే మిలీనియల్స్‌ క్లాసిక్‌ బ్లూ ఫ్రేమ్స్‌ని ఎంచుకోవచ్చు. ఇది ఫార్మల్‌ లుక్‌తో పాటు కాస్త యూత్‌ఫుల్‌ టచ్‌ ఇస్తుంది. ఒక్క నీలిరంగే ఎందుకు? అనుకుంటే మరో కలర్‌తో మిక్స్‌గా ఎంచుకోండి. ఇప్పుడు అనేక రకాల బ్రాండ్స్‌ రెండు రంగుల ఫ్రేమ్స్‌ని అందిస్తున్నాయి. నీలం, నలుపు లేదా బ్లూ, సిల్వర్‌ రంగుల కలయిక గల ఫ్రేమ్‌లను ఎంచుకోవచ్చు. కాలేజీ కుర్రకారుకి ఇది మంచి ఛాయిస్‌.
* ఇక ఫ్రేముల విషయానికొస్తే కేవలం గుండ్రని, చదరపు ఆకారపు ఫ్రేములే కావు. అనేక ఆకారాల్లో లభిస్తున్నాయి. మీ ముఖానికి తగినవి ఎంచుకోండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని