దుస్తులూ స్మార్టే!

మీరెలాగూ స్మార్టే.. మీ దుస్తుల సంగతి!! వాటినీ స్మార్ట్‌గా చేసేస్తే!! దుస్తులను స్మార్ట్‌ చేయడమేంటని ఆలోచిస్తున్నారా!

Published : 22 Feb 2020 00:12 IST

టెక్‌టాక్‌

మీరెలాగూ స్మార్టే.. మీ దుస్తుల సంగతి!! వాటినీ స్మార్ట్‌గా చేసేస్తే!! దుస్తులను స్మార్ట్‌ చేయడమేంటని ఆలోచిస్తున్నారా! అవును ఇప్పుడు అలాంటి గ్యాడ్జెట్సే అందుబాటులోకి వస్తున్నాయి. పేరు Spire Health Tag. దీన్ని మీ దుస్తులకి అతికిస్తే చాలు. మీపై ఓ కన్నేసి ఉంచుతుంది.. మీరు తీవ్ర ఒత్తిడిలో ఉంటే.. ఒత్తిడిని తగ్గించుకోమని చెబుతుంది. రోజులో మనం చేసే శారీరక శ్రమని అంచనా వేస్తుంది. గుండె లయ, నిద్ర, మన శ్వాసపై కూడా ఓ లుక్కేసుంచుతుంది. మీకు నిద్ర తగ్గితే.. ఈ వారంలో తక్కువగా నిద్రించారు. మంచి నిద్రకు ఈ టిప్స్‌ పాటించమని చెబుతుంది. సంబంధిత యాప్‌ ద్వారా నిద్ర, ఒత్తిడి, వ్యాయామం ఇలా అన్ని వివరాలు తెలుసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని