రోజు రంజితంగా

జీవితం అంటే జీవించటం. ఉన్న ప్రతిక్షణాన్నీ, నిమిషాన్నీ వినియోగించాలి. ఇరవై నాలుగు గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

Published : 22 Feb 2020 00:27 IST

లైఫ్‌ స్టైల్‌

జీవితం అంటే జీవించటం. ఉన్న ప్రతిక్షణాన్నీ, నిమిషాన్నీ వినియోగించాలి. ఇరవై నాలుగు గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే రోజును గౌరవించాలి. అప్పుడే సరికొత్త ఆశనీ, ఆలోచనను రేకెత్తిస్తూ జీవితాన్ని మరింత అద్భుతంగా ‘రోజు‘రంజితంగా గడపొచ్ఛు కొన్ని అలవాట్లు భావోద్వేగపరంగా, తెలివిపరంగా, ఆత్మపరంగా మనకు మంచి జీవితాన్నిస్తాయి. రోజును ఇలా ప్రారంభించి చూడండి..

ప్రపంచానికంటే ముందు...

హృదయాన్ని దోచుకునేది ఉదయమే. అందరికంటే ముందుగా తెల్లవారుజామున నిద్రలేవటం.. ఓ మంచి పని. నిద్రలేచాక ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ జోలికి వెళ్లకుండా నీతో నువ్వు గడుపు. నీతో నువ్వు అనుసంధానం కావాలి. అప్పుడే రోజంతటికీ సరిపడే పాజిటివ్‌ నెట్‌వర్క్‌ మీ చుట్టూ వై-ఫైలా అల్లుకుని ఉంటుంది.

సాధన చేయుమురా..

లేచాం కదాని.. భారంగా మంచం దిగి హాల్లోని సోఫాలో కూలబడొద్ధు హుషారుగా వ్యాయామానికి సిద్ధంకండి. నడవటం, పరుగులెత్తడం, జిమ్‌, ఏరోబిక్స్‌, యోగ.. లాంటి ఎక్సర్‌సైజ్‌లు చేస్తే ఆక్సిజన్‌ శరీరంలోకి ఎక్కువగా వెళ్తుంది. ఒత్తిడి, ఆతృత.. లాంటివి తగ్గుతాయి. శరీరంలో ఉపశమనం కలుగుతుంది.

ప్రణాళికతో..

ప్రతిరోజూ నీకు నువ్వు నీ అధీనంలో ఉండాలి. ‘ఆ ఏముందిలే.. జీవితం దానంతట అది సాగిపోద్దిలే’ అనుకోకుండా ప్రణాళికతో జీవిస్తే.. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిర్మాణాత్మకమైన జీవితం అలవడుతుంది.

మెదడుతో పనిచేయి

మంచి ఆరోగ్యానికి శారీరక శ్రమ ఎంత ముఖ్యమో.. మెదడు చురుకుగా ఉండాలంటే నిశిత పరిశీలన అవసరం. చదవటం, జీవితాన్ని పరిశీలించటం, స్ఫూర్తిదాయకమైనవి వినడంతో ఆశావహదృక్పథం అలవడుతుంది. దీంతో మానసిక స్థితి బాగుంటుంది. మంచి ఆలోచనలు వస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని