Published : 29 Feb 2020 00:37 IST

ఇప్పుడు వేసేయండిక..

ఫ్యాషన్‌

కాలంలో సింపుల్‌, సౌకర్యవంతమైన దుస్తులవైపే మొగ్గుచూపుతారు నేటితరం. అందులో ముందుంటాయి టీ-షర్టులు. రెండు, లేదా మూడు బటన్లతో కూడిన కాలర్‌ టీ-షర్టులు సౌకర్యవంతంగానే కాకుండా మంచి లుక్కిస్తాయి. పలు బ్రాండ్‌లతో మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. క్యాజువల్‌ లుక్‌కి, ఫార్మల్‌ లుక్‌కి మధ్యలో ఉంటాయివి. వీకెండ్స్‌లో షార్ట్స్‌ లేదా చినోస్‌పై, పని ప్రదేశాల్లో లెనెన్‌ బ్లేజర్‌తో వీటిని ధరించొచ్ఛు ఆఫీసుకి నీలి, తెలుపు, ముదురు ఆకుపచ్చ రంగుల్ని ఎంచుకోండి. ఇక వీకెండ్‌లో సరదాగా అలా బయటికెళితే ప్రింటెడ్‌ టీషర్ట్స్‌ని ప్రయత్నించొచ్ఛు మరీ వదులుగా, మరీ బిగుతుగా ఉండకుండా మీ అవుట్‌ఫిట్‌కి సరిపోయేవే ఎంచుకోండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని