బీటు మార్చండహే..

జోష్‌లో ఉన్నా, మనసుకి బాధగా అనిపించినా కాసేపు నచ్చిన సంగీతం వింటే చాలు. మరి, మీవైన మస్తీ మ్యూజిక్‌ ...

Published : 04 Apr 2020 00:31 IST

టెక్‌టాక్‌

జోష్‌లో ఉన్నా, మనసుకి బాధగా అనిపించినా కాసేపు నచ్చిన సంగీతం వింటే చాలు. మరి, మీవైన మస్తీ మ్యూజిక్‌ ఆల్బమ్‌లు వినాలంటే? నేటి తరానికి తగిన ఇయర్‌ఫోన్‌ ఉండాలిగా.. అందుకే బడ్జెట్‌ ఇయర్‌ఫోన్‌లు.. అనువుగా చెవుల్లోకి చేరి బీటు మార్చేస్తాయి.. మరెందుకాలస్యం.. ట్రెండీ లుక్‌తో ఆకట్టుకుంటున్న కొన్ని ఇయర్‌ఫోన్‌లపై ఓ లుక్కేయండి..

రెండూ అతుక్కుంటాయి..

వాడే ఇయర్‌ ఫోన్‌ ఏదైనా మ్యూజిక్‌ అవుట్‌పుట్‌తో పాటు వాడేందుకు అనువుగా ఉండాలనుకుంటాం. అలాంటిదే రియల్‌మీ బడ్స్‌2. మంచి బేస్‌తో పాటలు వినొచ్ఛు 1.25మీటర్‌ కేబుల్‌ ఉంది. అంతేకాదు.. ఇయర్‌ ఫోన్‌లు రెండూ చిక్కు పడకుండా మ్యాగ్నెట్‌తో అతుక్కుంటాయి.

ధర: రూ. 599

మ్యూజిక్‌ ప్రియులకు..

ఒకే ఇయర్‌ ఫోన్‌లో రెండు డ్రైవర్‌లు దీంట్లో ప్రత్యేకత. పేరు ఎంఐ డ్యుయల్‌ డ్రైవర్‌ ఇయర్‌ ఫోన్‌. నచ్చిన ట్రాక్స్‌కి నాణ్యమైన మ్యూజిక్‌ సౌండ్‌ సిస్టమ్‌తో వినొచ్ఛు పాటల్లో లిరిక్స్‌, మ్యూజిక్‌ బీట్స్‌ని చక్కగా బ్యాలెన్స్‌ చేస్తుంది.

ఎల్‌ ఆకారపు పిన్‌ దీని ప్రత్యేకత.

ధర: రూ. 799

ట్రెండీ రంగుల్లో...

ఏక రంగులో కాకుండా రెండు రంగుల కలగలుపుతో ఇయర్‌ఫోన్‌ని వాడదాం అనుకునేవారికి ‘బోట్‌ బేస్‌హెడ్స్‌ 220’ ప్రత్యేకం. నాణ్యమైన మ్యూజిక్‌తో పాటు మైక్‌తో కాల్స్‌ మాట్లాడొచ్ఛు

ధర: రూ. 599


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని