నిద్రలేపకుండానిన్ను వదలా..

లాక్‌డౌన్‌తో రోజంతా ఖాళీనే కదా.. ఫ్రెష్‌గా పొద్దున్నే చదువుకోవాలని ఉదయం ఐదింటికి అలారం పెట్టేస్తారు. ...

Published : 11 Apr 2020 00:35 IST

అలారం

లాక్‌డౌన్‌తో రోజంతా ఖాళీనే కదా.. ఫ్రెష్‌గా పొద్దున్నే చదువుకోవాలని ఉదయం ఐదింటికి అలారం పెట్టేస్తారు. నిద్ర మత్తులో స్నూజ్‌లో చాలా సార్లు పెట్టేస్తుంటారు. ఐదు పెట్టిన అలారం ఆరు అవుతుంది. అప్పుడుగానీ లేవరు.. అలా బద్ధకాన్ని దరి చేరకుండా చేసే ఓ యాప్‌ ఉంది తెలుసా? అదే Alarmy . ఎప్పుడూ పెట్టే అలారం మాదిరిగానే దీంట్లోనూ అలారం పెట్టుకోవడం క్షణాల్లో చేయొచ్ఛు కానీ, పెట్టుకున్న అలారంని పొద్దునే ఆపాలంటేనే నిద్ర మత్తు వదలాలి. అదే దీంట్లోని స్పెషల్‌. ఇది మిమ్మల్ని అలారం పెట్టేముందే ఓ షరతు పెడుతుంది. అదేంటంటే.. మీకు ఇష్టమైన పుస్తకం.. కాఫీ కప్ఫు. పెన్ను.. ఇలా ఏదైనా ఓ ఫొటో తీయాలి. దాన్ని అప్‌లోడ్‌చేయాలి. అంటే.. అది అలారం కీ అన్నమాట. ఉదయం అలారాన్ని ఆపాలంటే మీరు ఏ ఫొటో అయితే తాళంగా పెట్టారో దాన్ని కెమెరా కంటికి చూపితే తప్ప ఆఫ్‌ అవ్వదు. అప్పటికే మీ నిద్ర మత్తుపోతుంది. ఫొటోలు ఎందుకులే అనుకుంటే.. మత్తు వదిలించే లెక్కలేవైనా సెట్‌ చేసుకుని అలారం పెట్టుకోవచ్ఛు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని