Published : 25 Apr 2020 00:41 IST

ఇలా టక్కేసేయండి..

ఫ్యాషన్‌

కాస్త ప్రొఫెషనల్‌గా కనిపించాలంటే.. కచ్చితంగా టక్‌ చేస్తాం. అక్కడితో అయిపోదు.. మంచి బెల్టు పెట్టాలి. అప్పుడే.. మీరో టక్‌ జగదీష్‌ అయినట్టు. ఇక బెల్టు అనగానే గుర్తొచ్చేది లెదర్‌తో చేసినవే. ఫార్మల్‌ లుక్‌లో మెరవాలనుకున్న వారికి ఇవి సరైన ఎంపికేగానీ.. యువత క్యాజువల్‌గా ట్రెండీగా కనిపించేందుకు ఇంకా చాలా రకాలున్నాయి. అందుకు క్లాత్‌, స్వెడ్‌ బెల్టులను ప్రయత్నించొచ్చు. ఇవి మీ లుక్‌కి కాస్త ఫన్‌ టచ్‌నిస్తాయి. ప్రింట్‌, మల్టీకలర్‌ బెల్టులు కూడా ఇప్పుడు మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. విందులు, వినోదాలకు వెళ్లేప్పుడు ఓ క్యాజువల్‌ షర్ట్‌, ట్రెండీ డెనిమ్‌ ప్యాంట్‌ వేసి, ప్రింట్‌ లేదా మల్టీకలర్‌ బెల్టుతో టక్‌ జోడిస్తే అదిరే లుక్‌ మీ సొంతమవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు