Published : 06 Jun 2020 01:04 IST

పాటిస్తే.. అలసిపోరు

ఫిట్‌నెస్‌

వ్యాయామశాలలు ఎలాగూ ఇంకా తెరవలేదు. తెరిచినా వెళ్లాలంటే కాస్త ఆలోచించే పరిస్థితి. ఇంటి పట్టునే ఉండి ఏవో కొన్ని వర్కవుట్స్‌ చేసుకుంటే నయం అనుకుంటున్నారా? అయితే, కొన్ని బేసిక్‌ చిట్కాల్ని పాటిస్తే సరి. త్వరగా అలసిపోకుండా ఎక్కువ సమయం వర్కవుట్స్‌ చేయొచ్ఛు.

* కాలేజీలకు ఇంకొన్ని రోజులు సెలవులే. పొద్దెక్కాక లేచి వ్యాయామం చేద్దాం అనుకోవద్ధు ఇంకా ఎండల తీవ్రత తగ్గలేదుగా! వర్కవుట్స్‌ చేసేందుకు ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య ఎప్పుడైనా మొదలుపెట్టండి. ఉష్ణోగ్రత సాధారణ స్థితిలో ఉండటం వల్ల ఎక్కువ సేపు వర్కవుట్స్‌ చేయొచ్ఛు దీంతో త్వరగా అలసిపోరు. కుదిరితే సాయంత్రపు వేళల్లోనూ ఓ అరగంట వ్యాయామానికి కేటాయించండి.

* వర్కవుట్స్‌ చేసిన అనంతరం వెంటనే కూలర్‌ లేదా ఫ్యాన్‌ వద్దకు వెళ్లకపోవడమే మంచిది.

* వ్యాయామం మధ్యలో తక్షణ శక్తిని అందించే ఎనర్జీ డ్రింక్స్‌ తీసుకోవచ్ఛు మరింత చురుకుగా వ్యాయామం చేయగలుగుతారు.

* రోజులో వీలైనంత ఎక్కువ నీరు తాగండి. దీంతో శరీరం డీ-హైడ్రేషన్‌కి గురికాకుండా ఉంటుంది.

* పాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. ప్రొటీన్‌ షేక్స్‌ ప్రయత్నించొచ్ఛు

* రోజూ తప్పక 8గంటల నిద్ర అవసరం. అప్పుడే మీ శరీరం, మెదడు చురుకుగా పనిచేస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని