మొండిదాన్నే.. అది వ్యక్తిత్వం మాత్రమే!
జీవితాశయ సాధనకు అడుగులు వేసే తరుణం. కొత్త ఆశలు, సరికొత్త ఉత్తేజం, కోరుకున్న బాటలో పయనించే నూతన ఒరవడి. అలా డిగ్రీ పూర్తి చేసి పీజీలో అడుగుపెట్టాను. తరగతులు ప్రారంభమయ్యాయి. కొన్ని రోజులకు తనని చూశా. మొదటి చూపులోనే తన నవ్వుకి ఫిదా అయిపోయా. తనతో మాట్లాడాలి.. తననే చూస్తుండాలి అనిపించేది. అదెలాగా?అని అనుకుంటుండగానే కామన్ స్నేహితుడి ద్వారా తను పరిచయమయ్యాడు. మా పరిచయం మెల్లగా స్నేహంగా మారింది. ప్రేమకి పునాది స్నేహం అంటారు. మా విషయంలోనూ అదే జరిగింది. ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగేకొద్దీ తెలిసింది. అతనిది సున్నితమైన వ్యక్తిత్వమని. నేనేమో పూర్తిగా భిన్నం. కొంచెం మొండిదాన్ని. అయినా.. ఇద్దరి మధ్యా ఎప్పుడూ భేదాభిప్రాయాలకు తావివవ్వలేదు. అలా క్యాంపస్‌లో ప్రేమ పక్షుల్లా విహరించాం. కెరీర్‌ని ప్లాన్చేసుకున్నాం. కానీ, ఒకే ఒక్క సంఘటన వాటన్నింటినీ క్షణాల్లో దూరం చేసింది..
పరీక్షలు అయిపోయాయని స్నేహితులందరం అవుటింగ్‌కి వెళ్లాలనుకున్నాం. అందుకు తను ఒప్పుకోలేదు. వద్దన్నాడు. మొండిగా నేను వెళ్దామన్నా. అందరికీ ఓ జ్ఞాపకంగా మిగిలిపోయేలా ప్లాన్ చేద్దామని చెప్పే ప్రయత్నం చేశా. తను నాకిష్టం లేదు రానన్నాడు. ఎందుకిలా వద్దంటున్నావ్ అంటూ.. నేను బతిమాలే క్రమంలో అనుకోకుండా నా చేయి తనకి తగిలింది. తను నేను కావాలని కొట్టినట్టుగా ఫీల్ అయ్యాడు. అదీ అందరి ముందు అలా జరగడంతో మరింత హర్ట్ అయినట్టు అనిపించింది. అప్పుడు నా మొండితనం ఏమయ్యిందో తెలీదు. చిన్న పిల్లలా నేను కావాలని చేసింది కాదని బతిమాలా.. అందరి ముందు క్షమించమని అడిగా. తను ఏదో ముక్తసరిగా ఒకే అన్నాడుగానీ.. అప్పటి నుంచి తన ప్రేమలో మార్పు కనిపించింది. ఓ క్షణం దగ్గరగా వచ్ఛి. మళ్లీ దూరంగా ఉన్నట్టు ప్రవర్తిస్తాడు. అందుకు మా క్యాంపస్‌లో మేము కూర్చున్న బెంచ్లే సాక్ష్యం. మా ప్రేమ పరీక్షలతో పాటు చదువు పరీక్షలు మొదలయ్యాయి. ముగిశాక ఇళ్లకు వెళ్లాం. నవంబర్ 27 ఏం జరిగిందో తెలీదు. ఆ రోజు నాకు ఫోన్ చేసి నన్ను మర్చిపో.. మన పెళ్లి జరగదు. నీ జీవితం నువ్వు చూసుకో అన్నాడు. ఎందుకు? అని అడిగితే సమాధానం లేదు. ఒక్కసారిగా నా ఊహలు, ఆశలు మసక బారిపోయాయి. సెలవుల తర్వాత తిరిగి కాలేజ్‌కి వచ్చాం. ఇద్దరం కలిశాం. తనెటో చూస్తున్నాడు. నేను తననే చూస్తున్నా. నిమిషాల నిశ్శబ్దాన్ని తరిమేస్తూ నేనే అడిగా.. ఏం చేద్దాం? అని. తన నుంచి ఒక్కటే సమాధానం.. ‘నీ మొండితనాన్ని మార్చుకో’ అని. నేను క్షణం ఆలోచించకుండా ‘సరే’ అన్నా. ఈ సారి తన నుంచి మరో సందేహం. ‘మన పెళ్లికి పెద్దలు ఒప్పుకోరేమో’ అని. నేను సూటిగా ‘ఉద్యోగంలో స్థిరపడి ఒప్పిద్దాం’ అన్నాను. నాలో మళ్లీ మొండితనాన్ని చూశాడేమో.. మాట్లాడలేదు.
ఇద్దరం ఉద్యోగాల్లో స్థిరపడ్డాం. ఎప్పటిలాగే.. దూరంగా.. దగ్గరగా.! ఎప్పుడు మాట్లాడతాడో తెలీదు.. ఎందుకు మౌనం వహిస్తాడో అర్థం కాదు. రోజూ నాకు ప్రేమ పోరాటమే. తన కోసం నా వ్యక్తిత్వాన్ని చంపుకోవడానికి కూడా సిద్ధపడ్ఢా రెండేళ్ల కాలంలో ప్రతి క్షణం తన ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉన్నా. ఇప్పటికీ నేను తనకి ఒకటే చెబుతున్నా... నాలోని మొండితనం నా వ్యక్తిత్వం.. నీపై నాకున్న ప్రేమ నాలోని పరిపక్వం. అర్థం చేసుకుంటే నేనేంటో నీకు తెలుస్తుంది. నీ కోసం ఎదురు చూస్తా అని చెప్పడానికి నువ్వు అనుకునే నా మొండితనం అడ్డొస్తోంది. కానీ, దానికి చెప్పా నువ్వు నా వ్యక్తిత్వం మాత్రమే, నా ప్రేమకి అవరోధం కాదని. అది అర్థం చేసుకుంది. నువ్వూ ఆలోచిస్తావని ఆశ.. నీకు ఎప్పుడైనా అందేంత దూరంలో ఉంటా..
- దివ్య రాణి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Gangleader: మెగా ఫ్యాన్స్‌కు నిరాశ.. బాస్ మూవీ రీరిలీజ్ వాయిదా..!
-
Sports News
IND vs AUS: విరాట్‌ని ఆపకపోతే ఆస్ట్రేలియా గెలవడం చాలా కష్టం: ఆసీస్ మాజీ కెప్టెన్
-
India News
Cow Hug day: ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే కాదు.. కౌ హగ్ డే..!
-
World News
Operation Dost: విభేదాలున్నా.. తుర్కియేకు భారత్ ఆపన్నహస్తం..!
-
Movies News
Social Look: రుహానీ శర్మ రెడ్ రోజ్.. ప్రణీతకు బోర్ కొడితే?
-
General News
Andhra News: సీబీఐ విచారణ కోరుతూ రఘురామ పిటిషన్.. కేంద్రం, సీబీఐకి నోటీసులు జారీ