తీరైన ఆకృతికి.. మెడిసిన్‌ బాల్‌

క్రమం తప్పకుండా కసరత్తులు చేయాలన్నా.. కండలు పెంచి  ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అనిపించు కోవాలన్నా ముందు మనకు శరీరంపై సమన్వయం ఉండాలి. మెడిసిన్‌  బాల్స్‌ వర్కవుట్‌తో బాడీ, మైండ్‌ మధ్య మంచి సమన్వయం సాధించవచ్చు అంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు.

Published : 24 Oct 2020 01:15 IST

క్రమం తప్పకుండా కసరత్తులు చేయాలన్నా.. కండలు పెంచి  ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అనిపించు కోవాలన్నా ముందు మనకు శరీరంపై సమన్వయం ఉండాలి. మెడిసిన్‌  బాల్స్‌ వర్కవుట్‌తో బాడీ, మైండ్‌ మధ్య మంచి సమన్వయం సాధించవచ్చు అంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు.
మనం సాధారణంగా చేసే వర్కవుట్లని మెడిసిన్‌ బాల్‌తో కలిపి చేయడమే ఈ వ్యాయామం. దీనికి ముందు బాల్‌ ట్విస్టింగ్‌, లిఫ్టింగ్‌లాంటివి చేస్తూ వార్మప్‌ చేయాలి. తర్వాత నేరుగా అసలైన వ్యాయామాల్లోకి వెళ్లిపోవాలి. మొదట్లో బంతిని బ్యాలెన్స్‌ చేయడం ఎవరికైనా కష్టమే. ముందు 10 నుంచి 20 నిమిషాలు ఈ వ్యాయామాలు చేయాలి. పట్టు సాధించాక ఒక్కో వర్కవుట్‌ని 45 నిమిషాల వరకు చేయొచ్చు.
మెడిసిన్‌ బాల్స్‌ రకరకాల పరిమాణాలు, బరువుల్లో అందుబాటులో ఉన్నాయి. మన శక్తికి తగినవి ఎంపిక చేసుకోవాలి.


లంజ్‌: కాళ్లు, స్నాయువు, పిరుదులు, భుజాలు కండరాలు దృఢమవుతాయి.


స్క్వాట్‌: చేతులు, తొడలు గట్టిపడతాయి.


బ్రిడ్జ్‌: లోయర్‌ బ్యాక్‌ కండరాలు గట్టిపడతాయి. బ్యాలెన్సింగ్‌ మెరుగవుతుంది.


హాఫ్‌ సూపర్‌మ్యాన్‌: ఉదరభాగం, చేతి కండరాలు, అప్పర్‌ బ్యాక్‌.. అన్నింటికీ మంచి వ్యాయామం.


పుషప్‌: ఛాలెంజింగ్‌ వర్కవుట్‌. వెన్నెముక, పక్కటెములక కండరాలన్నీ దృఢమవుతాయి.


మెడిసిన్‌ బాల్‌ అనేది చిన్న ఎక్విప్‌మెంట్‌. స్టెబిలిటీ బాల్‌, స్విస్‌ బాల్‌, బోసు బాల్‌లను కూడా దీనికి ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు.


బాబీ, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని