పెంచేద్దాం.. పంచేద్దాం!

కరోనా కాలం. కాలు బయట పెట్టాలంటే జంకు. చాలామందికి వర్క్‌ ఫ్రమ్‌ హోం కూడానూ! దీనికితోడు ‘నో షేవ్‌ నవంబర్‌ ఛాలెంజ్‌’ వచ్చిపడింది. ఇంకేం.. కుర్రాళ్లు ట్రెండ్‌ని అందిపుచ్చుకుంటున్నారు.

Published : 21 Nov 2020 00:46 IST

కరోనా కాలం. కాలు బయట పెట్టాలంటే జంకు. చాలామందికి వర్క్‌ ఫ్రమ్‌ హోం కూడానూ! దీనికితోడు ‘నో షేవ్‌ నవంబర్‌ ఛాలెంజ్‌’ వచ్చిపడింది. ఇంకేం.. కుర్రాళ్లు ట్రెండ్‌ని అందిపుచ్చుకుంటున్నారు.

కారణం ఏదైనా ఇదివరకు ఎన్నడూ గడ్డం పెంచని వారు కూడా తమని తాము కొత్తగా చూసుకునేందుకు అడ్డంగా గడ్డం పెంచేస్తున్నారు. క్లీన్‌ షేవ్‌ మాత్రమే తెలిసిన వారూ నెట్టింట్లో చిట్కాల్ని ఫాలో అవుతూ గడ్డాన్ని స్టైలింగ్‌ చేసుకుంటూ మురిసిపోతున్నారు. దీనికి సెలబ్రిటీల రఫ్‌లుక్‌.. క్రీడాకారులు, సినిమా హీరోలు.. మాస్‌ లుక్‌లో కనిపించడంతో ధోరణి జోరు మీదుంది.
ఏంటీ ఛాలెంజ్‌?: మగవారిలో సోకే క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకే 2004లో నో షేవ్‌ నవంబర్‌ ప్రచారం మొదలైంది. ఎవరైనా క్యాన్సర్‌ చికిత్స సమయంలో జుత్తుని కోల్పోతామనే వాస్తవాన్ని గ్రహించేలా.. ప్రతి ఏడాదిలో నవంబర్‌ నెలంతా సెలూన్‌ ముఖం చూడకుండా ఉండాలి. అలాగే, ఆ నెలలో ఆదా చేసిన సెలూన్‌ ఖర్చుల్ని క్యాన్సర్‌ బాధితులకు అందజేయాలి. ప్రతి ఏడాది యువత దీన్నో ఉద్యమంలా పాటిస్తున్నారు.
పాటించాలి: గడ్డానికి సరైన కేర్‌ అవసరం. అప్పుడే మీరు హుందాగా, స్టైల్‌గా కనిపిస్తారు. ఇప్పటికే బాగా పొడవుగా గడ్డం పెరిగి ఉంటే బియర్డ్‌ వ్యాక్స్‌ వాడొచ్చు. మీ హెయిర్‌స్టైల్‌కి తగినట్టుగా స్టైలింగ్‌ చేసుకోవచ్చు. ఇక గడ్డం పెంచే క్రమంలో సాధారణ ఫేస్‌ వాష్‌లు కాకుండా ప్రత్యేక ఫేస్‌వాష్‌లు వాడాలి. ఒత్తుగా పెరిగేందుకు బియర్డ్‌ ఆయిల్స్‌నీ ప్రయత్నించొచ్చు. కోరుకున్న స్టైల్స్‌కి సెట్‌ కావాలనుకుంటే బియర్డ్‌ సాఫ్ట్‌నర్స్‌ని వాడొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని