టైము మారినా..ట్రెండు మారునోయ్‌

ట్రెండు మారితే ఫ్రెండు మారతాడో లేదో తెలియదు గానీ.. కాలం మారేకొద్దీ షాపింగ్‌ ట్రెండ్‌ మారిపోవడం ఖాయం అంటున్నాయి సర్వేలు. ముఖ్యంగా కరోనా కాలంలో కుర్రకారు ప్రాధాన్యాలు ఏంటి? వేటిపై ఎక్కువ ఖర్చు పెడుతున్నారు? అని ఓ సంస్థ సర్వే చేసింది. అందులో తేలిన విషయాలు ఏంటంటే..

Published : 05 Dec 2020 01:06 IST

ట్రెండు మారితే ఫ్రెండు మారతాడో లేదో తెలియదు గానీ.. కాలం మారేకొద్దీ షాపింగ్‌ ట్రెండ్‌ మారిపోవడం ఖాయం అంటున్నాయి సర్వేలు. ముఖ్యంగా కరోనా కాలంలో కుర్రకారు ప్రాధాన్యాలు ఏంటి? వేటిపై ఎక్కువ ఖర్చు పెడుతున్నారు? అని ఓ సంస్థ సర్వే చేసింది. అందులో తేలిన విషయాలు ఏంటంటే..
గ్యాడ్జెట్లు: ఓ పూట తినకపోయినా సర్దుకుపోయే వాళ్లున్నారు కానీ గ్యాడ్జెట్‌ లేకుండా పూట గడవని పరిస్థితి మిలీనియల్స్‌ది. వర్క్‌ ఫ్రం హోం, ఆన్‌లైన్‌ క్లాసులు పెరిగాక కుర్రకారు ఎక్కువగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లపై ఖర్చు పెడుతున్నారు. పైగా ఇవి విరివిగా వినోదాన్నీ పంచుతాయి కదా.
మ్యూజిక్‌: ఇయర్‌ఫోన్‌/హెడ్‌ఫోన్స్‌ లేకుండా కనిపించే యువత ఈమధ్య కాలంలో అరుదే. షాపింగ్‌లో.. మ్యూజిక్‌ సిస్టమ్‌లు, మల్టీపుల్‌ స్పీకర్లు, గేమింగ్‌ కన్‌సోల్స్‌ వాటా ఎక్కువే. కాస్త ఖర్చు పెట్టగలిగేవాళ్లు హోం థియేటర్‌లు సైతం కొనేస్తున్నారు. బిగ్‌ బిలియన్‌ డేలు, ఫెస్టివల్‌ సేల్స్‌, ఈజీ ఈఎంఐలు అంటూ ఈ కామర్స్‌ సైట్లు యువతని అటువైపు లాగుతున్నాయి.
ఫిట్‌నెస్‌ సామగ్రి: గతంతో పోలిస్తే ఈతరానికి ఫిట్‌నెస్‌పై ధ్యాస పెరిగిపోతుందనడం వాస్తవం. వర్క్‌ ఫ్రం హోం పెరగడం, కరోనా భయాల నేపథ్యంలో చాలామంది ఇంటినే జిమ్‌గా మార్చేస్తున్నారు. డంబెల్స్‌, ట్రాక్షన్‌ బార్‌, రోయింగ్‌ మెషిన్‌, ట్రెడ్‌మిల్‌లాంటి వాటిపై భారీగా వెచ్చిస్తున్నారు. నడక, పరుగు, కేలరీల లెక్కలు చెప్పే ఫిట్‌నెస్‌ బ్యాండ్స్‌ని సైతం పక్కాగా కొనేస్తున్నారు.
దుస్తులు, అలంకరణ: ఎన్ని కాలాలు మారినా యువత అలవాట్లలో మారనిది దుస్తులు, అలంకరణ సామగ్రిపై అధికంగా ఖర్చు పెట్టడం. అమ్మాయిలు, అబ్బాయిలనేం తేడా లేకుండా అందరిదీ అందం యావే. అబ్బాయిలు దుస్తులు, పాదరక్షలపై మోజు పడుతుంటే అమ్మాయిలు సౌందర్యోత్పత్తులపై వెచ్చిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని