షూపర్ సొగసుగా!
కాలికి వేసుకునేవే కదాని షూలని తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. షూస్ అంటే స్టైల్‌కి సింబళ్లు. కుర్రాళ్లని సోగ్గాళ్లుగా మార్చేసే సాధనాలు. వీటిలో రకరకాలున్నాయి. సందర్భాన్ని బట్టి ఈ ఐదూ మీ ర్యాక్‌లో తప్పనిసరిగా ఉండాలంటారు ఫ్యాషన్ గురూలు.
కాలికి వేసుకునేవే కదాని షూలని తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. షూస్ అంటే స్టైల్‌కి సింబళ్లు. కుర్రాళ్లని సోగ్గాళ్లుగా మార్చేసే సాధనాలు. వీటిలో రకరకాలున్నాయి. సందర్భాన్ని బట్టి ఈ ఐదూ మీ ర్యాక్‌లో తప్పనిసరిగా ఉండాలంటారు ఫ్యాషన్ గురూలు.
డ్రెస్ షూలు: ఇవి ఫార్మల్ షూలు. ప్రతి కుర్రాడికి అత్యవసరం. వీటిలో పాపులర్ నలుపు, గోధుమ రంగువి. ఏ డ్రెస్‌కైనా నప్పుతాయి. సూట్లు, చినోస్, జీన్స్.. వేటిపై అయినా ఈ ఫార్మల్స్ వేసుకోవచ్చు. సౌకర్యం, సౌలభ్యం కావాలనుకుంటే వీటిలాగే ఉండే స్లిప్-ఇన్స్ ప్రయత్నించవచ్చు.
స్నీకర్స్: స్నీకర్స్ జత లేకుండా కుర్రాళ్ల షూ కలెక్షన్ పూర్తవదు. స్టైలిష్‌గా, ఆధునికంగా కనిపించాలనుకునే అబ్బాయిలు ఓ జతను ర్యాక్‌లో పెట్టుకోవచ్చు. వీటిలో ఫ్యాన్సీ రంగులు ఎంచుకుంటే అందరి చూపులు మీపై పడటం ఖాయం.
బూట్స్: బూట్లు ఎప్పటికైనా హాట్నే. మ్యాన్లీగా కనిపించాలనుకునేవాళ్లు ఎంచుకోవచ్చు. ఇవి చిన్న హీల్స్‌తో వస్తాయి. ఎత్తు తక్కువగా ఉన్నవాళ్లకు బాగుంటాయి. వీటిలో ముదురు గోధుమవి అన్ని రంగుల డ్రెస్‌లకు అతికినట్టు ఉంటాయి.
లోఫర్స్: పార్టీలు, ఔట్‌డోర్ కార్యక్రమాలకు వెళ్లినప్పుడు ఇవి తప్పనిసరిగా ఉండాలి. లెదర్ లోఫర్స్, వాటికి తగ్గ డ్రెస్ వేస్తే ఎలాంటి కుర్రాడైనా హుందాగా కనిపిస్తాడు. దీంతోపాటు ఫార్మల్ షర్ట్ వేసి టై కడితే మరింత గాంభీర్యం వచ్చినట్టే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్‌గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్‌లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్‌లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్‌తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్‌బడ్స్