క్రాప్డ్‌ స్వెటర్‌.. చలి పరార్‌

చలి వణికిస్తోంది. మరోవైపు ఫ్యాషన్లతో చెలరేగిపోవాలనే కోరిక కుర్రకారును తరుముతోంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్‌ చేయడానికి యువత క్రాప్డ్‌ స్వెటర్లకు ఓటేస్తున్నారు.

Updated : 19 Dec 2020 07:07 IST

చలి వణికిస్తోంది. మరోవైపు ఫ్యాషన్లతో చెలరేగిపోవాలనే కోరిక కుర్రకారును తరుముతోంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్‌ చేయడానికి యువత క్రాప్డ్‌ స్వెటర్లకు ఓటేస్తున్నారు. చలికి చెక్‌ పెట్టేలా వెచ్చదనాన్ని ఇస్తూనే స్టైలిష్‌గా కనిపించడం వీటి ప్రత్యేకత. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా ఎక్కువ మంది ఫాలో అవుతున్న యునీసెక్స్‌ స్టైల్‌ ఇది. సెలెబ్రెటీలు ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణె, దిశా పటానీలు ఈ ట్రెండ్‌కి ఈమధ్యే మరింత జోరు తీసుకొచ్చారు. గతంలో ఉన్న క్రాప్‌ టాప్స్‌ ఔట్‌ఫిట్స్‌ ట్రెండ్‌ మెట్రో నగరాల నుంచి చిన్నచిన్న పట్టణాల దాకా.. సెలెబ్రెటీల నుంచి సామాన్య అతివల దాకా వీటిని అంతా ఆదరించారు. ఆ స్టైల్‌కే కొద్దిపాటి మార్పులు చేసి క్రాప్డ్‌ స్వెటర్లు తెర మీదికి తీసుకొచ్చారు డిజైనర్లు. ఇందులో వీ షేప్‌, మెడను చుట్టేసే డిజైన్లున్నాయి. అమ్మాయిలు కంటికింపుగా కనిపించేందుకు రంగురంగుల డిజైన్లు ఎంచుకుంటుంటే.. ఆధునికంగా కనిపించాలి అనుకునేవాళ్లు నాభి కిందకి దిగని టాప్స్‌కి జతగా హై-వెయిస్ట్‌ జీన్స్‌ ధరిస్తున్నారు. అబ్బాయిల ఫేవరెట్‌ ముదురు రంగులు, లాంగ్‌సైజ్‌లు. సంప్రదాయ ఊలుతోపాటు సింథటిక్‌ ఫైబర్‌తో తయారైనవి అత్యధికంగా అమ్ముడవుతున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని