తొలిచూపులోనే లవ్‌ వైరస్‌

మొదటిసారి నిన్ను ఇంటర్‌నెట్‌ కేఫ్‌లో చూసినప్పుడే నాకు లవ్‌ వైరస్‌ సోకింది. సాఫ్ట్‌గా ఉండే నాలో ఏ సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌లు పని చేయకుండా అన్నీ ఎర్రర్‌లే చూపిస్తున్నాయి.

Published : 02 Jan 2021 00:54 IST

వెరైటీ ప్రేమలేఖ

ప్రియమైన కంప్యూటర్‌ కిన్నెరకి..!

మొదటిసారి నిన్ను ఇంటర్‌నెట్‌ కేఫ్‌లో చూసినప్పుడే నాకు లవ్‌ వైరస్‌ సోకింది. సాఫ్ట్‌గా ఉండే నాలో ఏ సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌లు పని చేయకుండా అన్నీ ఎర్రర్‌లే చూపిస్తున్నాయి. నా ఫ్రెండ్స్‌ అంతా జావా నేర్చుకొని జాబ్‌ కొట్టి, జాలీగా లైఫ్‌లో సెటిల్‌ కావాలనుకుంటుంటే.. నాకేమో నీతో బావా అని పిలిపించుకొని, నీ చేతితో చేసిన కోవా తినాలని ఆశగా ఉంది. కిన్నెరా..! ఏదేమైనా మన బంధం ఎప్పటికైనా సీపీయూ, మానిటర్‌లాగే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నా లైఫ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అంతా నీ చేతుల్లోనే ఉంది. కీబోర్డ్‌, మౌస్‌లేని సిస్టమ్‌ ఎంత వేస్టో.. నువ్వు లేని నా జీవితమూ అంతే. అసలు తొలిచూపులోనే నా మెయిల్‌ ఐడీకి నువ్వే నా పాస్‌వర్డ్‌ అనుకున్నాను. ఫేస్‌బుక్‌లో నీ ఫొటో చూసి, వాట్సాప్‌లో మెసేజ్‌ చేసి, ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశాక.. నా లైఫ్‌ లాగిన్‌ నీతోనే అనుకున్నాను. అందుకే నీ ఊహలు, ఆలోచనలతోనే నా ఇన్‌బాక్స్‌, ఔట్‌బాక్స్‌లన్నీ నిండిపోయాయి. గూగుల్‌లో ఏది సెర్చ్‌ చేసినా నీ తలంపులే కనిపిస్తున్నాయి. నా మైండ్‌ మెమరీ అంతా నీ జ్ఞాపకాలతోనే నిండిపోయింది. కానీ అన్ని విషయాల్లో సూపర్‌ కంప్యూటర్‌లా ఫాస్ట్‌గా ఆలోచించే నువ్వు నా విషయంలో కరప్ట్‌ అయిన కంప్యూటర్‌లా ఎందుకు మొరాయిస్తున్నావు? నీతో లవ్‌ కనెక్షన్‌ లేని నా జీవితం పవర్‌ కనెక్షన్‌లేని కంప్యూటర్‌లాంటిది కిన్నెరా. అన్ని లాంగ్వేజెస్‌లో పట్టు ఉన్న నువ్వు నా లవ్‌ లాంగ్వేజ్‌ని అర్థం చేసుకొని ఆదరిస్తావని ఆశగా ఎదురుచూస్తున్నాను.

- ఇట్లు నీ సిస్టమ్‌ చిన్నోడు

- మాగంటి నాని, ఈమెయిల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు