రీసైకిల్‌.. సొగసుల్‌!

డిజైనర్‌ దుస్తులపై నినాదాలు, సెలెబ్రెటీల చిత్రాలు, నచ్చిన వ్యక్తుల బొమ్మలు వేసుకొని చెలరేగిపోవడం మామూలే. రీసైకిల్‌ డెనిమ్స్‌, జాకెట్స్‌పై ప్రింట్లు ముద్రించి సొగసులు చిందించడం తాజా ట్రెండ్‌.

Published : 06 Feb 2021 01:28 IST

డిజైనర్‌ దుస్తులపై నినాదాలు, సెలెబ్రెటీల చిత్రాలు, నచ్చిన వ్యక్తుల బొమ్మలు వేసుకొని చెలరేగిపోవడం మామూలే. రీసైకిల్‌ డెనిమ్స్‌, జాకెట్స్‌పై ప్రింట్లు ముద్రించి సొగసులు చిందించడం తాజా ట్రెండ్‌.
క్రాప్‌ టాప్‌, ఫర్‌, ట్రకర్‌ జాకెట్‌, బైకర్‌ జాకెట్‌, పుల్‌ ఓవర్‌... ఔట్‌ఫిట్‌ ఎలాంటిదైనా ప్రింట్లు వేసుకుంటుంటారు యూత్‌. కస్టమైజ్డ్‌ ఫ్లోరల్‌ డిజైన్లు, స్ఫూర్తిదా యక నాయకులు, నచ్చే సెలెబ్రెటీలు.. ఇవన్నీ పాతవే కదా.. కొత్తదనం ఏముందంటారా? అక్కడికే వస్తున్నాం బాస్‌! గతంలో కొత్త టీషర్టులు, డ్రెస్‌లపై మాత్రమే తమకిష్టమైన ప్రింట్లు వేసుకునే ధోరణి ఉండేది. ఇప్పుడు పాత డెనిమ్స్‌, జాకెట్లనే రీసైకిల్‌ చేసి మరీ కొత్త ముద్రలు వేసి ఇస్తున్నారు డిజైనర్లు. ఇందులో డిజిటల్‌ ప్రింట్లు, హ్యాండ్‌ ప్రింట్లు అని రెండు రకాలున్నాయి. కొన్ని పెద్దపెద్ద ఫ్యాషన్‌ కంపెనీలు పాత, కొత్త ఫ్యాబ్రిక్‌ని కలిపి ప్యాచ్‌వర్క్‌లతో డెనిమ్స్‌ రూపొందించి వాటిపై ప్రింట్లు వేస్తున్నారు. ఇది యునీసెక్స్‌ ఫ్యాషన్‌.

- హేమంత్‌ సిరి, ‌www.hemanthsiree.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని