నచ్చిందే వినొచ్చు

పీసీ లేదా ల్యాపీ.. దానికి హెడ్‌సెట్ పెట్టుకొని పని చేయడం ఈరోజుల్లో కుర్ర ఉద్యోగులకు అవసరంగా మారింది. కానీ మధ్యమధ్యలో బయటి నుంచి వచ్చే శబ్దాలు,....

Updated : 08 May 2021 08:28 IST

నయా గ్యాడ్జెట్‌

పీసీ లేదా ల్యాపీ.. దానికి హెడ్‌సెట్ పెట్టుకొని పని చేయడం ఈరోజుల్లో కుర్ర ఉద్యోగులకు అవసరంగా మారింది. కానీ మధ్యమధ్యలో బయటి నుంచి వచ్చే శబ్దాలు, సిస్టమ్‌ నోటిఫికేషన్లు ఏకాగ్రతను దెబ్బ తీస్తుంటాయి. ఈ అవాంతరాలేం లేకుండా కేవలం చేస్తున్న పని పైనే పూర్తి దృష్టి పెట్టేలా Neurable కంపెనీ ఈఈజీ (ఎలక్ట్రో ఎన్‌సెఫాలోగ్రఫీ) సెన్సర్ల సాయంతో పని చేసే హెడ్‌ఫోన్స్‌ తయారు చేసింది. అంటే మెదడు నుంచి వెలువడే సంకేతాలకు అనుగుణంగా, బయటి ఆటంకాలను అడ్డుకుని మనం వింటున్న దానిని మాత్రమే అనుమతిస్తుంది. న్యూరబుల్‌ సంస్థ చెబుతున్న లెక్కల ప్రకారం ఒక ఉద్యోగి రోజు మొత్తంలో కేవలం రెండు గంటల 53 నిమిషాలు మాత్రమే ఏకాగ్రతతో పని చేస్తాడట. ఒక్కసారి పనికి భంగం కలిగితే మళ్లీ ఆ దశ చేరడానికి సగటున 11 నిమిషాలు పడుతుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకే ఈ కొత్త రకం హెడ్‌ఫోన్స్‌ని తీసుకొచ్చాం అంటోంది కంపెనీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని