ఎప్పుడు మొదలెట్టాలి?

కరోనాతో కోలుకున్నవారికి వ్యాయామం విషయంలో ఎన్ని సందేహాలో. ఎప్పుడు మొదలుపెట్టాలి? ఎలాంటి కసరత్తులు చేయాలి? ఎంతవరకు కొనసాగించాలి? అసలు వర్కవుట్లు చేయాలా, వద్దా? నిపుణులు ఏం చెబుతున్నారంటే...

Published : 29 May 2021 01:06 IST

ఫిట్‌నెస్‌ మంత్ర

కరోనాతో కోలుకున్నవారికి వ్యాయామం విషయంలో ఎన్ని సందేహాలో. ఎప్పుడు మొదలుపెట్టాలి? ఎలాంటి కసరత్తులు చేయాలి? ఎంతవరకు కొనసాగించాలి? అసలు వర్కవుట్లు చేయాలా, వద్దా? నిపుణులు ఏం చెబుతున్నారంటే...
విశ్రాంతి: కరోనా నుంచి కోలుకున్న తర్వాత కసరత్తులు చేయడానికి తొందరేం లేదన్నది ఎక్కువమంది మాట. నీరసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కండరాల నొప్పులు.. ఇవి కొనసాగుతూనే ఉంటే కనీసం నెలరోజులైనా విశ్రాంతి తీసుకోవాలన్నది వైద్యులు, ఫిట్‌నెస్‌ నిపుణుల మాట.
నిదానంగా: అంతా సజావుగా ఉంటే నెగెటివ్‌ వచ్చిన ఓ పది రోజుల తర్వాత కసరత్తులు ప్రారంభించాలి. అప్పుడు కూడా లో ఇంటెన్సిటీ వ్యాయామాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. స్క్వాట్‌, క్రంచ్‌, జంపింగ్‌ జాక్‌, లంజ్‌, స్కేటర్స్‌లాంటివి అన్నమాట. అదీ 10 నిమిషాలకు మించొద్దు.
నడకతో: ఎవరైనా నడక లేదా జాగింగ్‌తో మొదలుపెట్టాలనేది ఫిట్‌నెస్‌ గురూల మాట. రెండోవారం నుంచి ఈ సమయం, వేగం, రెట్టింపు చేయొచ్చు. మెల్లమెల్లగా ఇంటెన్సిటీ పెంచుకోవచ్చు. బ్రీతింగ్‌ వ్యాయామాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
డైట్‌: వ్యాయామం మొదలుపెట్టినా, పెట్టకపోయినా సమతుల ఆహారం తీసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా ప్రొటీన్లు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి. కొద్దికొద్దిగా చొప్పున రోజుకి ఐదుసార్లు తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని