ఇంట్లోనే టై అండ్‌ డై

ఎక్కువ రోజులు వాడిన, చిరిగిపోయిన టీషర్టుని ఏం చేస్తాం? బయట పడేస్తాం లేదా ఇంట్లో అవసరాలకు వాడుకుంటాం. కానీ వాటినే టై అండ్‌ డై ఫ్యాషన్‌ టీషర్టుగా మార్చేయొచ్చు. సెలెబ్రిటీలకు బాగా ఇష్టమైన ఫ్యాషన్‌ ఇది. కళ్లకింపుగా కనిపించాలి అనుకునే కుర్రకారు దీనికి ఇంట్లోనే రంగులద్దుకోవచ్చు.

Published : 29 May 2021 01:13 IST

ఎక్కువ రోజులు వాడిన, చిరిగిపోయిన టీషర్టుని ఏం చేస్తాం? బయట పడేస్తాం లేదా ఇంట్లో అవసరాలకు వాడుకుంటాం. కానీ వాటినే టై అండ్‌ డై ఫ్యాషన్‌ టీషర్టుగా మార్చేయొచ్చు. సెలెబ్రిటీలకు బాగా ఇష్టమైన ఫ్యాషన్‌ ఇది. కళ్లకింపుగా కనిపించాలి అనుకునే కుర్రకారు దీనికి ఇంట్లోనే రంగులద్దుకోవచ్చు.

కావాల్సినవి: కలర్‌ టీషర్టు, బ్లీచ్‌, రబ్బరు గ్లౌజులు, రబ్బరు బ్యాండ్‌లు, ప్లాస్టిక్‌ షీట్‌లు, ప్లాస్టిక్‌ బాటిల్‌, పళ్లెం.
మొదటి స్టెప్‌: బాగా ఉతికి, ఆరబెట్టిన టీషర్టుని సమతల ప్రదేశంలో పరచాలి.
రెండో స్టెప్‌: టీషర్టుని మధ్యలో పట్టుకొని ఒక మడతలా తిప్పాలి. ఇది ఎలా వచ్చినా ఫరవాలేదు.
మూడో స్టెప్‌: అలా తిప్పి పట్టుకున్న ముడికి ఆకారం పోకుండా నాలుగు రబ్బరు బ్యాండ్లు వేసి ఉంచాలి.
నాలుగో స్టెప్‌: పళ్లేన్ని ఒకచోట ఉంచి దానిపై ఈ టీషర్టును పెట్టాలి.
ఐదో స్టెప్‌: దీనిపై సగం నీళ్లు, సగం బ్లీచ్‌ కలిపి నింపి పెట్టుకున్న ప్లాస్టిక్‌ బాటిల్‌ ద్రావకాన్ని చల్లాలి.
ఆరో స్టెప్‌: ఎక్కువగా ఉన్న బ్లీచ్‌ని తొలగించడానికి టీషర్టుని చల్లటి నీటిలో ముంచాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు