సత్తిగాడి పెండ్లి

గాపొద్దు.. పిలిశి మంచి పిల్లనిస్తమంటే అమాస అడ్డమొచ్చిందని మా అయ్యతో అడ్డంగా వాదించిన. ఇయ్యాల గాషారం మంచిగలేక నెత్తి మీదున్న గీ నాలుగు ఈకల్నీ రంగు టోపీ కింద భద్రంగా మడిచి దాసుకుంటున్నా. పెండ్లీడు పిల్లున్న ఏ తండ్రీ నా దిక్కు సూసుడే లేదాయె.

Published : 05 Jun 2021 00:30 IST

సరదాకి

గాపొద్దు.. పిలిశి మంచి పిల్లనిస్తమంటే అమాస అడ్డమొచ్చిందని మా అయ్యతో అడ్డంగా వాదించిన. ఇయ్యాల గాషారం మంచిగలేక నెత్తి మీదున్న గీ నాలుగు ఈకల్నీ రంగు టోపీ కింద భద్రంగా మడిచి దాసుకుంటున్నా. పెండ్లీడు పిల్లున్న ఏ తండ్రీ నా దిక్కు సూసుడే లేదాయె.. సోపతిగాళ్ళందరూ అత్తగార్లిచ్చిన కొత్త బండ్లమీద జంటపక్షులోలె రయ్య్‌మని నవ్వుకుంట నా ముందే ఎగురుతుంటే.. నవ్విన నాప శేనే పండుతదని చిన్నప్పుడు మా తాత జెప్పిన పాత సామెత మీదనే బిగ్గిత నిల్సున్న. ఉన్న నాలుగెంట్రుకలూ ఉబ్బరానికి ఉండేటట్టు లెవ్వని నా రంగుటోపీకి నాలుగు కిటికీలు పెట్టుకున్న. లేకలేకొచ్చిన సంబంధమైనా ఇది నా పంట పండిస్తదనుకుంటే.. గా గుంట చెంపల పిల్ల నా టోపీ జూసి నవ్విందని గుండెల్ల దిగిన గడ్డపారను పీకి ఎనకకు సూడకుంట ఏడ్సుకుంట వచ్చిన. బొచ్చుగాదు బిడ్డా.. మచ్చలేని మనసే నీకందం అంటే అవ్వ దీవెనార్తే ఆమెకు కోడలై వస్తదని వెయ్యి కండ్లతో నేను ఆశగా ఎదురుజూస్తానే ఉన్నా!

- ఇట్లు

వయసు ముదిరిన పడుసు పోరడు
పంపినవారు: దుడుగు నాగలత, సిద్దిపేట్‌

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని