చాహల్ జంట స్టెప్పులు..
బంతిని గింగిరాలు తిప్పుతూ బ్యాట్స్‌మన్‌ని బోల్తా కొట్టించే యజువేంద్ర చాహల్‌లో చాలా కళలే ఉన్నాయి. చొక్కా విప్పి కండలు చూపిస్తాడు. అదిరే స్టెప్పులేస్తాడు. కొత్త హెయిర్‌స్టైల్‌తో అలరిస్తాడు. అతడికి తగ్గ ఆల్‌రౌండర్ చాహల్ అర్ధాంగి ధనశ్రీ వర్మ. కొత్త కొత్త ప్రదేశాలను పరిచయం చేస్తూ వీడియోలు చేస్తోంది. మంచి డ్యాన్సర్ కూడా. ఈమధ్యే ఇద్దరూ కలిసి ‘ఫుట్‌వర్క్ కపుల్’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్న వీడియో వదిలారు. ‘అరెరరరా.. పూడా పోడా...’ అనే పాప్ సాంగ్‌కి అనుగుణంగా పాదాలు కదిపారు. చిన్న ప్రయత్నమే అయినా కామెంట్లు పోటెత్తాయి. ‘ధనశ్రీ గురించి తెలుసు. కానీ ఆమె విద్యార్థి మెల్లమెల్లగా మాస్టర్‌ని మించిపోయే డ్యాన్సర్ అయ్యేలా ఉన్నాడే’ అని ఒకరంటే.. ‘స్టెప్పులు, నవ్వులతో అభిమానుల్ని చంపేసేలా ఉన్నావ్ బాబూ’ అని మరొకరు కామెంట్ చేశారు. ఈమధ్య మ్యాచ్‌లేం లేకపోయినా ఈ రకంగా అయినా అభిమానుల్ని కట్టిపడేస్తున్నాడు చాహల్. అన్నట్టు ధనశ్రీకి సైతం మంచి పాపులారిటీ ఉంది. ఇన్‌స్టాలో తనని నాలుగున్నర మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
KVS Admit cards: కేవీల్లో ఉద్యోగాలకు పరీక్ష రేపట్నుంచే.. అడ్మిట్ కార్డులు పొందండిలా..
-
General News
Parliament: తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు: కేంద్రం
-
World News
Earthquake: భారీ భూకంపం.. తుర్కియేకు భారత సహాయ బృందాలు!
-
World News
Earthquake: తుర్కియే, సిరియాలో భూకంప విలయం.. 1600 దాటిన మృతులు
-
India News
Anand Mahindra: సానియా మీర్జా నాకు స్ఫూర్తి.. ఆనంద్ మహీంద్రా మోటివేషనల్ పోస్ట్
-
Movies News
Sembi Review: రివ్యూ: సెంబి